Share News

IRCTC Recruitment 2024: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2 లక్షల వరకు జీతం..!

ABN , Publish Date - Oct 13 , 2024 | 08:20 AM

IRCTC Recruitment Notification 2024: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(IRCTC)లో ఏజీహెచ్, డీజీఎం, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను రిక్రూట్ చేయనున్నారు.

IRCTC Recruitment 2024: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2 లక్షల వరకు జీతం..!
IRCTC Recruitment 2024

IRCTC Recruitment Notification 2024: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌(IRCTC)లో ఏజీహెచ్, డీజీఎం, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులను రిక్రూట్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రటియ ప్రారంభమైంది. అర్హతల, ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ చివరి తేదీ నవంబర్ 6వ తేదీగా ప్రకటించింది. రైల్వేలో ఈజీగా ఉద్యోగం పొందాలనుకుంటే ఆలస్యమెందుకు మరి.. ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు.


వయో పరిమితి ఎంత?

IRCTC అఫిషియల్ నోటిఫికేషన్ ప్రకారం.. ఏజీఎం, డీజీఎం, డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాలన్నీ పరిశీలించి జాబ్ కోసం అప్లై చేసుకోవవచ్చు.

జీతం..

  • ఏజీఎం, డీజీఎం జీతం రూ. 15,600 నుంచి రూ. 39,100 మధ్య ఉంటుంది.

  • డిప్యూటీ జనరల్ మేనేజర్(ఫైనాన్స్) జీతం రూ. 70,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటుంది.


అప్లై ఎలా చేయాలి..?

ఈ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు IRCTC అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ప్రొఫార్మాలో పూర్తిగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. ఆ దరఖాస్తును అవసరమైన పత్రాలతో పాటు (విజిలెన్స్ హిస్టరీ, DAR క్లియరెన్స్, గత మూడు సంవత్సరాల APARతో సహా) రైల్వేకి సమర్పించాలి. అలాగే అప్లికేషన్ స్కాన్ చేసిన కాపీని 6 నవంబర్ 2024 లోపు deputation@irctc.comకి ఇమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలో వారి ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేయబడతారు. మరింత సమాచారం కోసం కింద ఇచ్చిన IRCTC రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను చూడవచ్చు..


Also Read:

దసరా తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మూడో టీ20లో బంగ్లాపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్ స్వీప్

అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు..

For More Education News and Telugu News..

Updated Date - Oct 13 , 2024 | 08:20 AM