Share News

RRB JE Recruitment 2024: 7,951 పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:43 PM

మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది.

RRB JE Recruitment 2024: 7,951 పోస్టులకు రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం
RRB JE Recruitment 2024

మీరు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగి ఉండి రైల్వే ఉద్యోగాల(railway jobs) కోసం చుస్తున్నారా. అయితే ఈ మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్(RRB JE Recruitment 2024) 7,951 జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేయగా, రేపటి(జులై 30, 2024) నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 29, 2024గా ప్రకటించారు. అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ indianrailways.gov.inని సందర్శించడం ద్వారా రేపటి నుంచి ఆన్‌లైన్‌లో ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తును చేసుకోవచ్చు.

వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ రేపటి నుంచి జులై 30, 2024న తెరవబడుతుంది. ఈ గడువులోపు నిర్ణీత ఫార్మాట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులో సకాలంలో సవరణలు కూడా చేసుకోవచ్చు. అందుకోసం ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 8, 2024 మధ్య తేదీని నిర్ణయించారు. అలాగే పరీక్ష హెల్ప్‌డెస్క్ నంబర్ 0172 – 2730093 ద్వారా కూడా సంప్రదించవచ్చు.


ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

పోస్ట్‌ను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి అర్హత మారుతుంది. ఉదాహరణకు సంబంధిత సబ్జెక్టులో BE లేదా B.Tech ఉన్న అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్, సూపరింటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీతో B.Sc పూర్తి చేసిన అభ్యర్థులు కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 7,951 పోస్ట్‌లలో 7934 జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 17 కెమికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్‌వైజర్ / రీసెర్చ్ కోసం ఉన్నాయి.


వయసు, ఫీజు ఎంత?

వీటికి అప్లై చేయాలంటే వయోపరిమితి 18 నుంచి 33 సంవత్సరాలుగా ప్రకటించారు. రిజర్వ్‌డ్ కేటగిరీకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఫీజు రూ.250. ఎక్స్-సర్వీస్‌మెన్, పీహెచ్, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు రుసుము 250 రూపాయలు.


ఎంపిక ఎలా?

నాలుగు దశల పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ పోస్టులకు ఎంపిక జరుగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష ఉంటుంది. అంటే CBT I, CBT II. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే తదుపరి దశకు వెళతారు. రెండవ దశలో ఉత్తీర్ణత సాధించినప్పుడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనిని స్టేజ్ III అని పిలుస్తారు. నాల్గవ దశలో వైద్య పరీక్ష ఉంటుంది.

జీతం ఎంత?

పోస్టును బట్టి జీతం కూడా ఉంటుంది. ఉదాహరణకు జేఈ, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ లెవల్ 6 పోస్టులకు జీతం రూ.35,400. కెమికల్ సూపర్‌వైజర్, రీసెర్చ్, మెటలర్జికల్ సూపర్‌వైజర్ పోస్టులకు జీతం రూ.44,900.


ఇవి కూడా చదవండి:

Ola IPO: ఓలా ఐపీఓ షేర్ల ధర ఫిక్స్.. పెట్టుబడికి ఎంత కావాలంటే..

Rich Stock: ఏడాదిలోనే ధనవంతులను చేసిన టాటా గ్రూప్ స్టాక్.. ఇంకా పెరగనుందా?


Saving Schemes: ఈ పోస్టాఫీస్ స్కీం ద్వారా ఐదేళ్లలో లక్షాధికారులు కావచ్చు..ఎలాగంటే

For More Education News and Telugu News..

Updated Date - Jul 29 , 2024 | 09:48 PM