Share News

Manu Bhaker: మను భాకర్ శిక్షణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 29 , 2024 | 04:50 PM

పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Manu Bhaker: మను భాకర్ శిక్షణకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.. మంత్రి కీలక వ్యాఖ్యలు
Manu Bhaker training

పారిస్ ఒలింపిక్స్ 2024(paris olympics 2024)లో షూటర్ మను భాకర్(Manu Bhaker) చారిత్రాత్మకమైన కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh Mandaviya) ఆమె విజయంపై అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఆమె శిక్షణ వెనుక ఉన్న కృషి, ఖర్చు వివరాలను కూడా వెల్లడించారు. మను భాకర్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో తొలి కాంస్య పతకాన్ని సాధించి భారత్‌ గర్వపడేలా చేసిందని మంత్రి అన్నారు. అంతేకాదు ఆమె 'ఖేలో ఇండియా'లో భాగమయ్యారని తెలిపారు. ప్రధాని మోదీ 'ఖేలో ఇండియా'ను ప్రారంభించారని, ఈ చొరవతో దేశంలో క్రీడా మౌలిక సదుపాయాలు సృష్టించామని, క్రీడా పోటీ పెరిగిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో పాఠశాల, కళాశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించడం ప్రారంభించామని వెల్లడించారు.


ప్రతిభావంతులను గుర్తించి..

ఆ విధంగా గుర్తించిన ప్రతిభావంతులకు శిక్షణ(training) ఇచ్చేందుకు మంచి కోచ్‌లను నియమించి, వారికి మంచి శిక్షణ ఇచ్చి, వారికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా టాప్స్ పథకం కింద ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోనే మను శిక్షణ కోసం దాదాపు రూ.2 కోట్లు వెచ్చించామని కేంద్ర మంత్రి అన్నారు. ఇందుకోసం ఆమెను జర్మనీ, స్విట్జర్లాండ్‌లకు పంపినట్లు మాండవ్య వెల్లడించారు. తనకు నచ్చిన కోచ్‌ని నియమించుకునేందుకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు. అథ్లెట్లందరికీ మేము మంచి పర్యావరణ వ్యవస్థను అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి గుర్తు చేశారు. తద్వారా వారు జాతీయ, అంతర్జాతీయ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు మంచి ప్రదర్శన చేస్తారన్న నమ్మకం ఉందన్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి.


ప్రోత్సహించండి..

దీంతోపాటు నేడు జరుగుతున్న షూటింగ్, విలువిద్య పోటీల గురించి మానవీయ మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #CheerForBharatతో మన క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ సందర్భంగా మన అథ్లెట్లు రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన మహిళల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో భాకర్(Manu Bhaker) మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో ఒలింపిక్స్‌ షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. అయితే ఇది తెలిసిన పలువురు దేశంలో క్రీడల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే మంచి క్రీడాకారులను గుర్తించి వారికి ఆర్థిక సహకారం అందిస్తే దేశానికి మరిన్ని పతకాలు వస్తాయని అంటున్నారు.


ఇవి కూడా చదవండి:

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌‌లో భారత్‌కు మరో మెడల్ వచ్చే ఛాన్స్.. ఫైనల్‌కు ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీం


MS Dhoni: సీఎస్కేకు ధోనీ గుడ్‌బై.. ఆ నలుగురి కోసమే త్యాగం?

Paris Olympics 2024: లక్ష్య సేన్ విజయం డిలీట్.. ఒలింపిక్స్‌లో భారత ఆటగాడికి వింత పరిస్థితి!


Read Latest Sports News and Telugu News

Updated Date - Jul 29 , 2024 | 04:57 PM