Share News

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల..

ABN , Publish Date - Oct 11 , 2024 | 07:19 PM

Telangana Govt Jobs 2024: నిరుద్యోగులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా 371 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఏ శాఖలో పోస్టులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలు..?

Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల..
Telangana Govt Jobs

Telangana Govt Jobs 2024: నిరుద్యోగులకు దసరా కానుక ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. కొత్తగా 371 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఏ శాఖలో పోస్టులు? ఎవరు అప్లై చేసుకోవచ్చు? అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మొదలు..? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది.. పూర్తి వివరాలు మీకోసం..


తెలంగాణ ఆరోగ్య శాఖలో మరో 371 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. 271 నర్సింగ్ ఆఫీసర్, 99 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేవంత్ సర్కార్ ఇప్పటికే 7,300 పోస్టులను భర్తీ చేసింది. మరో 6,500 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరో 272 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్), 99 ఫార్మసిస్ట్(గ్రేడ్ 2) పోస్టుల భర్తీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి శుక్రవారం నాడు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా ప్రకటనతో మొత్తం పోస్టుల సంఖ్య 732కు పెరిగింది. అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తు చేసేందుకు గడువు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నారు.


Also Read:

వీడు మామూలు దొంగ కాదు.. పావురాన్ని వాడుకుని..

త్వరపడండి.. స్కూటర్‌పై రూ.30 వేల వరకు తగ్గింపు

కొంపతీసి కుక్కర్‌‌ను ఇలా తెరవలేదు కదా..

For More Education News and Telugu News..

Updated Date - Oct 11 , 2024 | 07:19 PM