TG TET 2024: టీఎస్ టెట్‌కు అప్లై చేస్తున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..
ABN , Publish Date - Nov 08 , 2024 | 06:55 PM
TG TET 2024 Application: తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (TGED) తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2024 కోసం రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(tgtet2024.aptonline.in)లో అప్లై చేసుకోవచ్చు.
TG TET 2024 Application: తెలంగాణ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ (TGED) తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) 2024 కోసం రిజిస్ట్రేషన్/దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(tgtet2024.aptonline.in)లో అప్లై చేసుకోవచ్చు. అధికారిక ప్రకటన ప్రకారం.. అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ నవంబర్ 20గా నిర్ణయించారు. పరీక్షలు జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య నిర్వహించనున్నారు. పరీక్ష హాల్ టికెట్స్‌ని డిసెంబర్ 26 తరువాత అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు.
ఇది ముఖ్యం..
అయితే, టెట్ అప్లై చేసే వారు.. దరఖాస్తు కోసం ఏయే డాక్యూమెంట్స్ అవసరం.. ఫీజు ఎంత.. అప్లై చేయడానికి అర్హతలేంటి.. వంటి సమాచారం తప్పక తెలిసి ఉండాలి. పూర్తి వివరాలు తమ వద్ద ఉంటే.. అప్లికేషన్ త్వరగా పూర్తవుతుంది. లేదంటే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. టెట్ అప్లికేషన్‌కు ఏం కావాలి.. ఫీజు ఎంత.. మీరు ఏం చేయాలి.. అనే వివరాలను ఈ కథనంలో పూర్తిగా అందిస్తున్నాం.
టెట్ అప్లికేషన్ ఎలా చేయాలి..
టీజీటెట్ 2024 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లో TG TET-2024-II ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇది నేరుగా టెట్ అప్లికేషన్ వెబ్‌సైట్(https://tgtet2024.aptonline.in/tgtet/) ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్‌కు అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయాలి. అంతకంటే ముందు.. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. పేమెంట్ చేసిన తరువాత ఆ పేమెంట్‌కు సంబంధించిన రిఫరెన్స్ ఐడీ/జర్నల్ నెంబర్‌ను భద్రపరుచుకోవాలి. ఆ జర్నల్ నెంబర్ ఆధారంగానే తదుపరి అప్లికేషన్ చేయడానికి వీలుంటుంది.
టెట్ అప్లికేషన్ ఫీజు..
ఒక పేపర్ మాత్రమే రాసే అభ్యర్థులు రూ. 750 చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు అప్లై చేసుకుంటే రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మరో వెసులుబాటు కల్పించారు. మే/జూన్ 2024లో జరిగిన టెట్‌కు అప్లై చేసుకుని.. అర్హత సాధించని వారు, అర్హత సాధించి ఇప్పుడు తమ స్కోర్‌ను పెంచుకోవాలనుకునే వారు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
TG TET Paper 1 అర్హతలు (1 to 5th Class):
1. కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ (SC/ ST/OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు), ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 2-సంవత్సరాల డిప్లొమా లేదా 4-సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BElEd) లేదా స్పెషల్ ఎడ్యూకేషన్‌లో 2-సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లేదా..
2. కనీసం 45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ (SC/ ST/OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం) మరియు ఎలిమెంటరీ ఎడ్యూకేషన్‌లో 2-సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత లేదా 4-సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (BElEd) లేదా 2-సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.(ఇది 23 డిసెంబర్ 2015న విడుదలైన గైడ్‌లైన్స్‌కి ముందు డీఈడీ/డీఈఐఈడీ పూర్తి చేసిన వారికి వర్తిస్తుంది.)
లేదా
3. కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ (SC/ ST/OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd)/ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
టీజీటెట్ పేపర్ - 2 (6 నుండి 8 తరగతులు):
1. కనీసం 50 శాతం మార్కులతో BA/BSc/BCom (SC/ ST/ OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd)/ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లేదా
2. కనీసం 50 శాతం మార్కులతో BA/BSc/BCom (SC/ ST/ OBC/దివ్యాంగ అభ్యర్థులకు 40 శాతం) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd)/ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లేదా
3. కనీసం 50 శాతం మార్కులతో 4 సంవత్సరాల BAEd/ BScEd (SC/ ST/ OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లేదా
4. లాంగ్వేజ్ టీచర్ల కోసం, ఐచ్ఛిక సబ్జెక్టులలో ఒకటిగా సంబంధిత భాషతో గ్రాడ్యుయేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ లేదా సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ లేదా సంబంధిత భాషలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్/ మెథడాలజీలలో ఒకటిగా సంబంధిత భాషతో BEd ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
లేదా
5. BE/ BTech కనీసం 50 శాతం మార్కులతో (SC/ ST/ OBC/ దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం) మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (BEd) లేదా BEd (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణులై ఉండాలి.
టీజీటెట్ అప్లికేషన్ 2024 విధానం సంక్షిప్తంగా..
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://tgtet2024.aptonline.in/tgtet/ ఓపెన్ చేయాలి.
2. ఫీజు పేమెంట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
3. మీరు రాయలనుకుంటున్న ఎగ్జామ్ పేపర్ ఎంచుకుని.. అందుకు ఫీజు పేమెంట్ చేయాలి.
4. ‘Know your journal number’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త, ఎగ్జామ్ పేపర్ సెలక్ట్ చేసుకోవాలి. దీంతో మీ జర్నల్ నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ నెంబర్‌ను మీరు రాసిపెట్టుకోవాలి.
6. ఇప్పుడు అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
7. ఇక్కడ జర్నల్ నెంబర్/పేమెంట్ రిఫరెన్స్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
8. ఇక్కడ టెట్ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేయాలి.
9. అప్లికేషన్ సమయంలో కోరిన డాక్యూమెంట్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నింటినీ అప్‌లోడ్ చేయాలి.
10. ఇదంతా అయిపోయాక అప్లికేషన్‌ను సబ్‌మిట్ కొట్టాలి.
11. ఇప్పుడు మీ అప్లికేషన్‌ఫామ్‌ని ప్రింటౌట్ తీసుకోవాలి.
Also Read:
For More Education News and Telugu New..