National: విడుదలైన యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు .. డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ABN , Publish Date - Dec 29 , 2024 | 06:09 PM
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో జరగనున్న యూజీసీ నెట్-2024 అడ్మిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్‍లో విడుదలయ్యాయి. డౌన్లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నెట్ (UGC-NET)డిసెంబర్ 2024 పరీక్ష అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేసింది. అభ్యర్థులు యూజీసీ నెట్ 2024 డిసెంబర్ పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను ugcnet.nta.ac.inలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజీసీ నెట్ హాల్ టిక్కెట్‌ను NTA అధికారిక వెబ్‌సైట్‍లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు నంబరు, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాలి.
ఆన్‌లైన్ విధానంలో( CBT)జరగనున్న యూజీసీ నెట్ 2024 డిసెంబర్ పరీక్షఅడ్మిట్ కార్డులను NTA (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌పై తమ ఫోటో, సంతకం, బార్‌కోడ్, క్యూఆర్‌కోడ్‌ను తనిఖీ చేసుకోవాలని సూచించింది. ఫోటో, సంతకం, బార్‌కోడ్, క్యూఆర్ కోడ్‌లలో ఏ ఒక్కటి లేకపోయినా అభ్యర్థులు అడ్మిట్ కార్డ్ మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజీసీ సూచించింది. 2025 జనవరి 3 నుంచి 16 మధ్య మొత్తం 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ డిసెంబర్ 2024 పరీక్షలు నిర్వహించనున్నారు.
జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీడేందుకు యూజీసీ నెట్ ఈ పరీక్ష కోసం డిసెంబర్ 11 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నెంబర్ లేదా ugcnet@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది.