Share News

UPSC Civils Notification 2024: UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Feb 14 , 2024 | 03:08 PM

UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

UPSC Civils Notification 2024: UPSC సివిల్స్ 2024 నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC IAS పరీక్ష (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024) నోటిఫికేషన్‌ను తన అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఫిబ్రవరి 14న మధ్యాహ్నం అప్‌లోడ్ చేసింది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించారు. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు upsconline.nic.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.


UPSC CSE నోటిఫికేషన్‌తో పాటు, కమిషన్ తన దరఖాస్తు ఫారమ్‌ను కూడా విడుదల చేసింది. దరఖాస్తు చేయడానికి ముందు మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాలి. కానీ అందులో ఎలాంటి పొరపాటు ఉండకూడదు. UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు upsc సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ 2024 pdfని జాగ్రత్తగా చదవడం చాలా ముఖ్యం. మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. UPSC పరీక్షకు మూడు వారాల ముందు అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తారు. అయితే UPSC CSE 2024 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1,056 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Updated Date - Feb 14 , 2024 | 03:08 PM