Loksabha Polls: మాజీ కేంద్రమంత్రికి టికెట్ నిరాకరణ.. కాంగ్రెస్ పార్టీకి భర్త రిజైన్
ABN , Publish Date - Mar 25 , 2024 | 05:16 PM
అసోం నౌబోయిచా సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భరత్ చంద్ర. ఇతని సతీమణి రాణి కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రిగా పనిచేశారు. రాణికి లోక్ సభ టికెట్ కోసం భరత్ చంద్ర ప్రయత్నించారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక వ్యాఖ్యంతో రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపించారు.
డిస్పూర్: లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) టికెట్లు ఆశిస్తోన్న ఆశవాహులు ఎక్కువ మంది ఉంటున్నారు. ఒక్కో చోట కనీసం నలుగురు అభ్యర్థులు అయినా ఉంటున్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థి చరిష్మా, విజయవాకాశాలు ఆధారంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. ఓ మాజీ కేంద్రమంత్రికి సైతం టికెట్ దక్క లేదు. తన సతీమణికే టికెట్ ఇవ్వరా అని ఎమ్మెల్యే (MLA) పార్టీకి రాజీనామా చేశారు.
ఎక్కడంటే..?
నౌబోయిచా సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర (Bharath Chandra) పార్టీకి రాజీనామా చేశారు. భరత్ సతీమణి రాణి కాంగ్రెస్ నేత, కేంద్రమంత్రిగా పనిచేశారు. రాణికి లోక్ సభ టికెట్ కోసం భరత్ చంద్ర ప్రయత్నించారు. వివిధ కారణాలతో టికెట్ ఇవ్వలేదు. దీంతో భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఏక వ్యాఖ్యంతో రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పంపించారు. ఆదివారం నాడు అసోం కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ పదవికి కూడా భరత్ రిజైన్ చేశారు.
అభ్యర్థిని ప్రకటించిన తర్వాత
లఖింపూర్ లోక్ సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఉదయ్ శంకర్ హజారికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అభ్యర్థిని ప్రకటించిన రెండు రోజులకు భరత్ చంద్ర కాంగ్రెస్ పార్టీని వీడారు. లఖింపూర్ లోక్ సభ నియోజకవర్గం రాణికి కంచుకోట. ఇక్కడి నుంచి ఆమె మూడుసార్లు విజయం సాధించారు. ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా విధులు నిర్వహించారు. మాజీ కేంద్రమంత్రికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ భరత్ చంద్ర రాజీనామా చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి:
Karnataka: కర్ణాటకలో కీలక పరిణామం.. బీజేపీలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీ విలీనం