Share News

AP Election 2024: పులివర్తి నానిపై దాడి ఘటనపై స్పందించిన చంద్రబాబు

ABN , Publish Date - May 14 , 2024 | 07:28 PM

తిరుపతి రణరంగంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద రెచ్చిపోయిన వైసీసీ గూండాలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

AP Election 2024: పులివర్తి నానిపై దాడి ఘటనపై స్పందించిన చంద్రబాబు

తిరుపతి రణరంగంగా మారింది. ఈవీఎంలు భద్రపరిచిన పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద రెచ్చిపోయిన వైసీసీ గూండాలు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తిరుపతిలో చంద్రగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ గూండాల దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.


ఓటమికి భయపడిన పిరికిపందలే దీనికి కారకులని మండిపడ్డారు. స్ట్రాంగ్ రూమ్ ఉన్న పద్మావతి మహిళా యూనివర్సిటీలో 150 మంది వైసీపీ రౌడీలు కత్తులు, రాడ్లతో స్వైరవిహారం చేస్తుంటే ఓటర్ల తీర్పుకు రక్షణ ఏది? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిన్న (సోమవారం) పోలింగ్ రోజున కూడా హింసకు పాల్పడ్డారని, పోలింగ్ తర్వాత కూడా దాడులు చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పోలింగ్ అనంతరం దాడులను నివారించడంలో, ప్రజలకు, ప్రతిపక్షాలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరోవైపు మాచర్లలో ఇప్పుడు కూడా హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయని చంద్రబాబు అన్నారు. తాడిపత్రిలోనూ దాడులు నిరాటంకంగా సాగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని, ఎన్నికల సంఘం, డీజీపీ, ఎస్పీలు దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Updated Date - May 14 , 2024 | 07:28 PM