Share News

Pawan Kalyan: జగన్ నేను తలచుకుంటే తట్టుకోలేవు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Apr 21 , 2024 | 08:59 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ శివ శివానీ స్కూల్‌లో పేపర్ లీక్ చేసే సమయంలో తాను చెగువేరా గురించి చదివానని గుర్తుచేశారు. జగన్ నేను తలచుకుంటే తట్టుకోలేవు అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Pawan Kalyan: జగన్ నేను తలచుకుంటే తట్టుకోలేవు: పవన్ కల్యాణ్
Janasena Chief Pawan Kalyan Slams CM Jagan

ప.గో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (Jagan) జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ శివ శివానీ స్కూల్‌లో పేపర్ లీక్ చేసే సమయంలో తాను చెగువేరా గురించి చదివానని గుర్తుచేశారు. జగన్ నేను తలచుకుంటే తట్టుకోలేవు అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ బ్యాచ్ అంతా కలుగుల్లో పందికొక్కులు, ఎలుకల సమూహం అని విరుచుకుపడ్డారు. తన సోదరుడు చిరంజీవి మాజీ కేంద్రమంత్రి అని గుర్తుచేశారు. చిరంజీవి అజాత శత్రువు అని ఆయనను ఏమైనా అంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నరసాపురం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

YS Sharmila: ఆస్తిలో వాటా ఇవ్వాలి, అది ఆడ బిడ్డ హక్కు: వైఎస్ షర్మిల సంచలనం


‘తనకు నరసాపురం మొగల్తూరు రెండు తీపి జ్ఙాపకాలు. పదేళ్ల పాటు ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిన పార్టీ జనసేన. డబ్బు, అహంకారంతో వైసీపీ ఎదిగింది. దశాబ్దం పాటు దెబ్బలు తిని నిలబడ్డా. అందుకు కారణం చెక్కు చెదరని మీ ప్రేమ, అభిమానం. నా మీద ఒక్క కేసు లేవు. జగన్ మీద 32 కేసులు ఉన్నాయి. 5 కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలని బీజేపీ పెద్దలను అడిగాను. ఎన్డీఏ ఓటు వేయండి.. పంటకు నీరు ఇస్తాం. అభివృద్ధి చేస్తాం. సంక్షేమ పథకాల్లో కోత ఉండదని హామీ ఇస్తున్నా. పస్తులు లేని రాష్ట్రాన్ని నిర్మించడమే జనసేన కూటమి లక్ష్యం అని’ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.


‘పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతోపాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. నరసాపురం కోససీమ వశిష్ట వారధి నిర్మిస్తాం. వశిష్ట వారధి నిర్మించకుండా ఓటు అడగనని జగన్ అన్నాడు. ఓటు కోసం వస్తే జగన్‌కు బుద్ది చెప్పండి. లేసు పరిశ్రమకు పూర్వ వైభవం కల్పించి, మహిళలకు ఆదాయం కల్పిస్తాం. జగన్ అక్వా రైతులను ముంచాడు. గుజరాత్ తరువాత ఎక్కువ సముద్ర తీరం (970 కిలోమీటర్లు) ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. మత్స్యకార సామాజిక వర్గాన్ని ఆదుకుంటాం. డీప్ సీ ఫిషింగ్ చేయాలంటే ధైర్యం కావాలి. పలుమార్లు మత్స్యకారులు అంతర్జాతీయ జలాల్లోకి వెళితే కేంద్రంతో మాట్లాడి సమస్య పరిష్కరించా. మత్స్యకారులకు సంబంధించిన 217 జీవోను రద్దు చేస్తాం. మత్స్యకార సోదరులకు ప్రమాదం జరిగితే పది లక్షలు బీమా చెల్లిస్తాం. మత్స్యకారులపై పెట్టిన ఎక్సైజ్ కేసులను ఎత్తివేస్తాం అని’ పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు.


‘జగన్ కాపులను టార్గెట్ చేసి, వారితో నన్ను తిట్టిస్తున్నాడు. రజనీ కాంత్ వచ్చి చంద్రబాబుని మెచ్చుకుంటే సజ్జల తిడతాడు. వారు గుంట నక్కల సమూహం. సింహం ఎలా వస్తుందో తెలుసా..? సజ్జల పులివెందుల నుంచి వచ్చారో, ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారో తెలియదు. విప్లవ కారుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. వైసీపీ రౌడీ మూకలను హెచ్చరిస్తున్నా. ఎన్నికల సమయంలో వెర్రి వేషాలు వేస్తే తాట తీస్తా. నా మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినా సహించా. నా అన్న చిరంజీవిని సజ్జల ఏమైనా అంటే ఊరుకునేది లేదు. చిరంజీవి అజాత శత్రువు. ఆయన జోలికి, శెట్టి బలిజ, కాపు సామాజిక వర్గం జోలికి వస్తే చూస్తూ ఊరుకోను. సజ్జల నీకు నా సంగతి తెలియదు. చిరంజీవిని బెదిరిస్తున్నారు. ఆయన ఒక మాజీ కేంద్ర మంత్రి. మిమ్మల్ని రోడ్డు మీద మోకాళ్ల మీద నడిపిస్తా. సజ్జల ఏమనుకుంటున్నావు. జగన్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీరు కలుగుల్లో పంది కొక్కులు.. ఎలుకల సమూహం.. మీరు సింహాలు కాదు అని’ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

AP Elections: మాకు దేవుడే రక్ష.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 08:59 PM