Share News

YS Sharmila: ఆస్తిలో వాటా ఇవ్వాలి, అది ఆడ బిడ్డ హక్కు: వైఎస్ షర్మిల సంచలనం

ABN , Publish Date - Apr 21 , 2024 | 06:31 PM

అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన అప్పుల గురించి ప్రపంచానికి తెలియాలని ప్రస్తావించానని వివరించారు. జగన్ నుంచి షర్మిల రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

YS Sharmila: ఆస్తిలో వాటా ఇవ్వాలి, అది ఆడ బిడ్డ హక్కు: వైఎస్ షర్మిల సంచలనం
YS Sharmila

కర్నూలు: అఫిడవిట్‌లో పేర్కొన్న అప్పుల గురించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) స్పష్టత ఇచ్చారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ ఇచ్చిన అప్పుల గురించి ప్రపంచానికి తెలియాలని ప్రస్తావించానని వివరించారు. జగన్ నుంచి షర్మిల రూ.82 కోట్లు, వదిన భారతి నుంచి రూ. 19 లక్షల అప్పు తీసుకున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్న, వదిన షర్మిల ఎందుకు అప్పు తీసుకున్నారు..? ఆస్తిలో వాటా ఇవ్వలేదా..? అనే చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై షర్మిల మీడియాకు వివరించారు.

AP Elections: మాకు దేవుడే రక్ష.. సీఎం జగన్‌పై షర్మిల విసుర్లు


‘ఆస్తిలో అక్కాచెల్లెళ్లకు అన్నదమ్ములు వాటా ఇవ్వాలి. అది ఆడబిడ్డ జన్మ హక్కు. సోదరికి ఇవ్వాల్సిన హక్కు అన్నదమ్ముళ్లకు ఉంటుంది. అది బాధ్యత కూడా. సోదరి పిల్లలకు మేనమామ బాధ్యత ఉంటుంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ అని పెద్దలు చెబుతుంటారు. ఇది అందరూ పాటించే నియమం కూడా. కొందరు చెల్లెళ్లకు ఆస్తిలో ఇవ్వాల్సిన వాటాను తమ సొంత సంపాదనగా భావిస్తారు. చెల్లెళ్ళకు గిప్ట్ ఇస్తున్నామని బిల్డప్ ఇస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. చెల్లెకు కొసరు ఇచ్చి అప్పు ఇచ్చినట్టు చూపిస్తారు. ఇది వాస్తవం. తన విషయంలో జరిగిన అప్పు గురించి మా కుటుంబం మొత్తానికి తెలుసు. ఆ భగవంతుడికి కూడా తెలుసు అని’ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

Taraka Ratna: ఎన్నికల వేళ.. అలేఖ్య రెడ్డి ట్విట్ వైరల్

మరిన్ని ఏపీ వార్తల కోసం

Updated Date - Apr 21 , 2024 | 06:48 PM