Congress: తక్కువ సీట్లలో కాంగ్రెస్ పోటీ..? ఎందుకంటే..?
ABN , Publish Date - May 09 , 2024 | 03:37 PM
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. ఈ సారి తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమని తెలుస్తోంది.
ఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. ఈ సారి తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహర్, తమిళనాడులో 201 లోక్ సభ స్థానాల ఉన్నాయి. ఆయా చోట్ల కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మెజార్టీ సీట్లు సాధిస్తున్నాయి. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ విధించుకుంది. ఆ క్రమంలో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లను కేటాయించింది.
కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాలు
1989-1999 మధ్య కాంగ్రెస్ పార్టీ 450 సీట్లలో బరిలోకి దిగింది.
2009లో కాంగ్రెస్ పార్టీ 440 సీట్లకు పోటీ చేసింది.
2014లో 464 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది.
2019లో కాంగ్రెస్ పార్టీ 421 స్థానాల్లో పోటీ చేసింది.
కాంగ్రెస్ విజయాలు
1984లో కాంగ్రెస్ పార్టీ 414 సీట్లు సాధించి అధికారం చేపట్టింది.
1989లో 197 సీట్లు గెలుచుకుంది.
1991లో 244 సీట్లలో విజయం సాధించింది. పీవీ నరసింహా రావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించారు.
1996లో 140 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.
1998లో 141 సీట్లలో విజయం సాధించింది.
1999లో 114 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
2004లో 145 సీట్లలో జయకేతనం ఎగరేసింది.
2009లో 206 సీట్లు గెలిచి సత్తా చాటింది.
1984 తర్వాత ఏ ఎన్నికలో కూడా మెజార్టీ మార్క్‌ను కాంగ్రెస్ పార్టీ సాధించలేదు.
2014లో కేవలం 44 సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది.
2019లో 52 సీట్లకు పరిమితమైంది.
గత 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకోలేక పోయింది. బీజేపీ నాలుగు దశాబ్దాల్లో ఎదిగింది. 2 సీట్ల నుంచి 303 సీట్లు సాధించింది.
Read Latest Natinal News And Telugu News