Loksabha Polls: నోట్ల కట్టల కలకలం.. భారీగా పట్టుబడ్డ నగదు
ABN , Publish Date - Apr 19 , 2024 | 04:34 PM
లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని కూడా పోలీసులు సీజ్ చేశారు.
హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రధాన పార్టీలు ఉన్నాయి. హైదరాబాద్ లో (Hyderabad) భారీగా నగదు పట్టుబడింది. నగదుతోపాటు, బంగారం, వెండి, గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల నార్త్ జోన్ పరిధిలో కోటి 15 లక్షల 58 వేల విలువ జేసే నగదు, నగలు, బంగారం, వెండి, గంజాయి పట్టుబడ్డాయి. పట్టుబడిన గంజాయి 89.232 కిలోలు ఉంది. దీని విలువ రూ.60 లక్షల 78 వేలు ఉంటుందని పోలీసులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన రాష్ట్రంలో గల 17 లోక్ సభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
CM Revanth: కేసీఆర్ కాలం చెల్లింది.. కారు షెడ్డుకు పోయింది.. సీఎం రేవంత్ వ్యంగ్యాస్త్రాలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం