Kesineni Chinni: కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో లేదంటే..
ABN , Publish Date - May 10 , 2024 | 11:59 AM
అక్రమ ఆస్తులు, కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సవాల్ విసిరారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు.
విజయవాడ: అక్రమ ఆస్తులు, కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని (Kesineni Chinni) సవాల్ విసిరారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు. భవిష్యత్తు లో ఏం చేయబోతున్నాం.. గతంలో ఏం చేశామో తాము చెబుతున్నామన్నారు. కేశినేని నాని మాత్రం మా పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. కలల రాజధాని అమరావతిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని కేశినేని చిన్ని అన్నారు.
జగన్ సంకన దాక్కున్న నీకు.. నిలదీసే దమ్ముందా?
ప్రజల ఆర్ధిక వనరులు దెబ్బ తీసి పొట్ట కొట్టారు. కేశినేని నాని పదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పలేరా? నా మీద నిందలు వేస్తూ... ప్రజా సమస్యలుగా చిత్రీకరిస్తావా? అసలు ప్రజలకు ఏం చేశావో ఎందుకు చెప్పడం లేదు? రైల్వే ప్రాజెక్టుల గురించి ఎప్పుడైనా మాట్లాడావా? కరోనా సమయంలో అడ్రెస్ లేకుండా ప్రజలను వదిలేసి వెళ్లిపోయావు. జగన్ సంకన దాక్కున్న నీకు.. ఆయన్ని నిలదీసే దమ్ముందా? అసలు విజయవాడ అభివృద్ధికి జగన్ ఏం చేశాడో అడుగు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోలేక ఎదుటి వాళ్లపై నిందలు వేయడమే నీ పనా? ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా... నేను అడిగిన వాటికి సూటిగా జవాబు ఇచ్చే ధైర్యం నీకుందా? పీవీపీపై నోరు పారేసుకుని నోటీసు అందుకోగానే కాళ్ల మీద పడిన వ్యక్తి వి నీవు. నా మీద ఎటువంటి కేసులు ఉన్నా , రేరా కేసు ఉన్నా నిరూపించు.
Supreme Court: తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం
దమ్ము, ధైర్యం ఉంటే నానీ.. మీడియా ముందుకు రా..
అబద్దాలతో బతకడం మాని, వాస్తవాలు చెప్పు. ల్యాండ్ గ్రాబర్ అని ప్రచారం చేస్తున్నావు.. ఎక్కడెక్కడ ఏమున్నాయో బయట పెట్టు. నీ ఆఫీస్ పక్కన స్థలం కబ్జా చేయాలని చూస్తే పోలీసులు అడ్డుకున్నారు. నీ అరాచకాలు, భూకబ్జాలపై నీ సాక్షితో పాటు అన్ని మీడియాల్లో ఆధారాలు ఉన్నాయి. 2019-2024 వరకు ఎంపిగా నువ్వు ఏం చేశావో చెప్పు. ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లి గోల్ఫ్ ఆడుకోవడమే నీ పని. ప్రజల సమస్యలు పై కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తావా? నీలాగా నేను వ్యక్తిగత దూషణలు చేసే వ్యక్తి ని కాను. నేను ప్రజలకు, నియోజకవర్గానికి ఏం చేస్తానో, ఏం చేయగలనో నేను చెబుతున్నా. దమ్ము, ధైర్యం ఉంటే నానీ.. మీడియా ముందుకు రా.. ఈ అభివృద్ధి చేశా, ప్రజలకు ఈ మంచి చేశా అని చెప్పు. అవి లేవు కాబట్టే... నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నావు.
ఇవి కూడా చదవండి..
Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!
AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!