Share News

Supreme Court: తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం

ABN , Publish Date - May 10 , 2024 | 11:52 AM

Andhrapradesh: ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించి జగన్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది.

Supreme Court: తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశం
Supreme Court Fire on AP Govt

న్యూఢిల్లీ, మే 10: ఏపీలో(Andhrapradesh) అక్రమ ఇసుక తవ్వకాలకు (Illegal sand mining) సంబంధించి జగన్ ప్రభుత్వంపై (Jagan Government) సుప్రీం కోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే అక్రమ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని రాష్ట్ర సర్కార్‌కు (AP Government) సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. అక్రమ ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయడానికి వెంటనే అధికారుల బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని ఉన్నతన్యాయస్థానం ఆర్డర్స్ పాస్ చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా? లేదా? అన్నది తనిఖీ చేయాలని ఆదేశించింది.

AP Elections: హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు...: చంద్రబాబు


ఇసుక అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఏపీ ప్రభుత్వం చర్యలన్నీ కాగితాలకే పరిమితమని.. ఆ విషయం తమకు తెలుసని న్యాయస్థానం పేర్కొంది. వచ్చే గురువారం నాటికి (మే 16) సుప్రీంకోర్టు అక్రమ ఇసుక తవ్వకాల నిలిపివేతపై తీసుకున్న చర్యలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశించినా ఏపీలో ఇసుక అక్రమాలు ఆగడం లేదంటూ ప్రతివాది నాగేంద్ర కుమార్ ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించారు. నాగేంద్ర కుమార్ పేర్కొన్న ప్రదేశాల్లో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకొని తరువాత సుప్రీంకు నివేదించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతివాది నాగేంద్ర కుమార్ తరపున సుప్రీంలో సీనియర్ కౌన్సిల్ సిద్ధార్ధ లూత్రా వాదనలు వినిపించారు.


ఇవి కూడా చదవండి..

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!

AP Elections: చివరి రెండు రోజులు.. ఎవరి వ్యూహాలు వారివి..!

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 11:58 AM