Loksabha Polls: ఓటు వేసిన ప్రముఖులు
ABN , Publish Date - May 20 , 2024 | 08:07 AM
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.
దేశవ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 5వ విడత బరిలో 695 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 82 మంది మహిళలు ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బరిలో ఉన్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు నిచ్చారు. ఓటింగ్ శాతం పెరిగాలని, ప్రతి ఒక్కరు విధిగా ఓటు వేయాలని ఎన్నికల సంఘం కూడా కోరింది.
పశ్చిమ బెంగాల్‌లో గల ఆరంబాగ్‌లో బీజేపీ- టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రాజ్‌హతికి చెందిన బీజేపీ నేత తలకు గాయమైంది. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి వెనక తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని బీజేపీ ఆరోపించింది.
లక్నోలో ఓటు వేసిన అనంతరం వేలికి ఉన్న సిరా చుక్క చూపుతున్న బీఎస్పీ అధినేత మాయావతి
ఓటు హక్కు వినియోగించుకున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్
ముంబైలో ఓటు హక్కు వేసిన పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ
For More National News and Telugu News..