Loksabha Polls: కాంగ్రెస్ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేది: ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 17 , 2024 | 07:07 PM
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.
అగర్తలా: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ (PM Modi) విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపురలో బుధవారం మోదీ (Modi) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మొబైల్ బిల్ రూ.5 వేలు వచ్చేదని వివరించారు. కాంగ్రెస్ అనుసరించే ‘లూట్ ఈస్ట్ పాలసీ’లో లూట్.. దోపిడీ ఉందని సెటైర్లు వేశారు. తమది యాక్ట్ ఈస్ట్ పాలసీ అని, చెప్పింది చేస్తాం అని ప్రధాని మోదీ వివరించారు.
Delhi: ఆప్ కా రాం రాజ్య వెబ్‌సైట్‌ని ప్రారంభించిన ఆప్.. అసలేంటిది
టవర్స్ పనిచేసేవి కావు
గతంలో త్రిపురలో మొబైల్ టవర్స్ సరిగా పనిచేసేవి కాదని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 5జీ నెట్ వర్క్ చక్కగా వస్తుందని వివరించారు. నాణ్యమైన నెట్ వర్క్ అందిస్తూ.. నెలకు మొబైల్ బిల్ అందుబాటులో అందజేస్తున్నామని తెలిపారు. ఎంత నెట్ వాడినప్పటికీ నెలకు రూ.400 నుంచి రూ.500 వరకు బిల్ వస్తుందని వివరించారు. ఇలాంటి ఉత్తమ నెట్ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఛార్జీ చేసేదని తెలిపారు.
Lok Sabha polls 2024: ఎన్డీయేకు 150 సీట్లు దాటవు.. సంయుక్త సమావేశంలో రాహుల్, అఖిలేష్
అవినీతిమయం
కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాలను అవినీతి మయం చేసిందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పాటు పడలేదని విమర్శించారు. తర్వాత కమ్యునిస్టులు మరింత నాశనం చేశారని మండిపడ్డారు. దేశంలో 3 కోట్ల నూతన గృహాలు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. త్రిపురలో పేద ప్రజలకు అందులో భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
Priyanka Gandhi: అర్థం లేని వ్యాఖ్యలపై స్పందించను.. కంగన కామెంట్లపై ప్రియాంక గాంధీ ఆగ్రహం
మరిన్ని జాతీయ వార్తల కోసం