Calcutta High Court: బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహించొద్దు, ఈసీకి హైకోర్టు సూచన..!!
ABN , Publish Date - Apr 23 , 2024 | 09:54 PM
పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్ కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన ముర్షిదాబాద్‌లో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
కోల్ కతా: పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగేందుకు అనుమతించబోమని కోల్ కతా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శ్రీరామ నవమి ఊరేగింపు సందర్భంగా 17వ తేదీన ముర్షిదాబాద్‌లో మత ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
‘రాష్ట్రంలో హింసాత్మక వాతావరణం నేపథ్యంలో శాంతి, సామరస్యానికి చోటు లేకుండా పోయింది. ఇదే విషయాన్ని తాము ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతాం. బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలను నిర్వహించొద్దని కోరతాం. అదొక్కటే మార్గం అనిపిస్తోంది అని’ ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇరు వర్గాలకు చెందిన వారు గొడవ పడటం సరికాదు. అలాంటి వారు తమ నేతను ఎన్నుకునే అర్హత కోల్పోయారు అని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ముర్షీదాబాద్ లాంటి ఘటనలు కోల్ కతాలో కూడా జరిగాయి. ఇక్కడ హింసాత్మకంగా మారలేదు అని గుర్తు చేసింది.
Read Latest National News and Telugu News