AP Election 2024: పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు: చంద్రబాబు
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:39 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారయంత్రాంగం ప్రభుత్వానిక వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులు కుట్రలు, కుతంత్రాలను అమలు చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల (AP Election 2024) నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారయంత్రాంగం ప్రభుత్వానిక వత్తాసు పలుకుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోచేతి నీళ్లు తాగే కొందరు అధికారులు కుట్రలు, కుతంత్రాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ తీరుతో గత నెలలో 33 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హత్యల్లో కొందరు అధికారులు భాగస్వాములయ్యారని మండిపడ్డారు.
ఒక పార్టీ ప్రలోభాల కోసం అధికారులు పనిచేయడం తప్పు అని చంద్రబాబు ఖండించారు. ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పంచాయతీ పరిధిలో ఒక్కో ఉద్యోగి 45 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తాడన్నారు. పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేదే ఇంటి వద్ద ఇస్తారు. ఇందులో తప్పేముంది? అని చంద్రబాబు ప్రశ్నించారు.
పెన్షన్ల నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటున్నారని, అయితే పెన్షన్ తీసుకునే అందరి దగ్గర ఫోన్లు ఉండవు కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో ఎలా తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంటూ మరో కొత్త డ్రామాకు తెరదించామని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ప్రమాదకరమని, ఎన్నికల సంఘం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని ఆకాంక్షించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అన్ని పార్టీలు ఒకటేనని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉంటాయని చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘ముఖ్యమంత్రి ఒక్కడే ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని వాడుకోవచ్చు. బస్సులు వాడుకోవచ్చు. గ్రౌండ్ వాడుకోవచ్చు అంటే కుదరదు. సభలకు బెదిరించి ఎక్కువమందిని తీసుకురావొచ్చని అనుకుంటున్నారు. ఇవన్నీ జరగడానికి వీల్లేదు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Supreme Court: ఇసుక తవ్వకాలపై సుప్రీం ఫైర్.. నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
AP Elections: కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News