Health Tips: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..
ABN , Publish Date - Aug 01 , 2024 | 06:28 PM
Food for Healthy Life: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మోకాళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయస్కులు సైతం కీళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నొప్పులు భరించలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మోకాళ్ల నొప్పులు వస్తే ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది.
Food for Healthy Life: ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజలు మోకాళ్ల నొప్పులతో సతమతం అవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా యుక్త వయస్కులు సైతం కీళ్ల నొప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నొప్పులు భరించలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మోకాళ్ల నొప్పులు వస్తే ఏ పని చేయలేని పరిస్థితి ఉంటుంది. నిల్చోడానికి, కూర్చోడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే, ఈ నొప్పులకు కారణం ప్రధానంగా మనం తినే ఆహారమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మనం తినే జంక్ ఫుడ్స్, అధిక కొవ్వులు ఉన్న ఆహారాలు ఎముకలను బలహీనపరుస్తాయంటున్నారు. అందుకే.. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ముందుగా తాము తినే ఆహారంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. కీళ్ల నొప్పులు ఉన్నవారు ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినొద్దని సూచిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాలు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చక్కెర, తీపి పదర్థాలు..
మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు చక్కెర, చక్కెర వాడిన పదర్థాలుకు దూరంగా ఉండాలి. షుగర్ ఫుడ్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది శరీరంలో మంటలను కలిగిస్తుంది. రక్తంలో అధిక షుగర్ కీళ్ల నొప్పులకు కారణం అవుతుంది. అందుకే.. షుగర్‌తో చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచింది.
అధిక ఉప్పు వొద్దు..
మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఉప్పును తక్కువగా వినియోగించాలి. ఉప్పు అధికంగా ఉన్న పదార్థాలను అస్సలు తినకూడదు. ఉప్పును మితంగా తీసుకోవాలి. రోజూ వారి ఆహారంలో ఉప్పును మితంగా వినియోగించాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు అధికమవుతాయి.
పాల ఉత్పత్తులు..
మోకాళ్లు, కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలు తాగితే ప్రయోజనమే ఉంటుంది. అయితే, పాల ఉత్పత్తులు మాత్రం ఆ నొప్పులను తీవ్రతరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు పాల ఉత్పత్తులు తినొద్దని సూచిస్తున్నారు. వీటిని తినడం వల్ల శరీరంలో మంట పెరుగుతుంది. తద్వారా కీళ్లలో భరించ లేని నొప్పి కలుగుతుంది. అందుకే పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Note: ప్రజల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా వైద్య నిపుణులు అందించిన సమాచారాన్ని పైన పేర్కొనడం జరిగింది. దీనిని ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు.