Share News

Banana: ఈ 5 రకాల సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అరటిపండ్లు తినకూడదట..!

ABN , Publish Date - Jul 11 , 2024 | 09:31 AM

అరటిపండు ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండు. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు అందరూ దీన్ని సులువుగా తినగలరు. పేద వారి నుండి ధనవంతుల వరకు అందరూ దీన్ని కొనగలరు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అరటిపండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే..

Banana: ఈ 5 రకాల సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా అరటిపండ్లు తినకూడదట..!

అరటిపండు ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పండు. చిన్నపిల్లల నుండి వృద్దుల వరకు అందరూ దీన్ని సులువుగా తినగలరు. పేద వారి నుండి ధనవంతుల వరకు అందరూ దీన్ని కొనగలరు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అరటిపండ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. దానికి తగినట్టే అరటిపండ్లలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. కానీ 5 రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం అరటిపండ్లను అస్సలు తినకూడదట. ఇంతకీ ఆ సమస్యలేంటో తెలుసుకుంటే..

అలెర్జీలు..

అలెర్జీ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లను తినకూడదట. కొంతమందికి అరటిపండ్లు తింటే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తుంటాయి.

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!


మధుమేహం..

అరటిపండులో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఈ కారణంగా మధుమేహం ఉన్నవారు అరటిపండ్లను తినడం మంచిది కాదు.

మూత్రపిండ సమస్యలు..

అరటిపండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి అధిక మొత్తంలో పొటాషియం ఉన్న ఆహారాలు చేటు చేస్తాయి. వీటికి దూరంగా ఉండాలి.

రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 6 ప్రయోజనాలు మీ సొంతం..!


పార్శపు నొప్పి లేదా మైగ్రేన్..

పార్శపు నొప్పి లేదా మైగ్రేన్ సమస్య ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు. అరటిపండ్లు మైగ్రేన్ ను ప్రేరేపిస్తాయి.

ఉబ్బరం..

కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు అరటిపండ్లు తినకూడదు. అరటి పండ్లు ఈ సమస్యలను మరింత పెంచుతాయి.

Hair Spa Treatment: మృదువైన జుట్టుకోసం ఇంట్లోనే హెయిర్ స్పా ట్రీట్మెంట్.. ఇలా చేసేయండి..!


Optical Illusion: మీ కళ్లకు అసలైన పరీక్ష.. 5సెకెన్లలో అవకాడోలలో హృదయం ఆకారాన్ని కనిపెట్టండి చూద్దాం..!


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 11 , 2024 | 09:31 AM