Bangalore: 14 నెలల పసిపాపకు విజయవంతంగా గుండె మార్పిడి
ABN , Publish Date - Nov 22 , 2024 | 01:43 PM
అత్యంత చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు గుండెమార్పిడి శస్త్రచికిత్సలను నారాయణ ఆసుపత్రి(Narayana Hospital) వైద్యులు విజయవంతం చేశారు. అత్యంత తక్కువ వయస్సు కల్గిన పాపకు ఆపరేషన్ ద్వారా ప్రాణం పోశారు.
బెంగళూరు: అత్యంత చిన్న వయస్సులోనే గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న 14 నెలల పసిపాపకు గుండెమార్పిడి శస్త్రచికిత్సలను నారాయణ ఆసుపత్రి(Narayana Hospital) వైద్యులు విజయవంతం చేశారు. అత్యంత తక్కువ వయస్సు కల్గిన పాపకు ఆపరేషన్ ద్వారా ప్రాణం పోశారు. ఈమేరకు గురువారం నారాయణ వైద్యనిపుణులు శశిరాజ్(Shashiraj) బృందం ఆపరేషన్ వివరాలను మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్ల చిన్నారి కోలుకోలేని నాడీసంబంధ స్థితికి చేరడంతో దాతగా మారారు.
ఈ వార్తను కూడా చదవండి: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఫైర్.. బీపీఎల్ కార్డుల రద్దు పేదల కడుపు కొట్టడమే
చిన్నారి కుటుంబ సభ్యులు మానవత్వంతో ముందడుగు వేశారు. ఇటీవల ఆగస్టు 18న డాక్టర్ సుదేశ్ ప్రభు(Dr. Sudesh Prabhu) నేతృత్వంలో పసిపాపకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్టు శశిరాజ్ వెల్లడించారు. పది నెలల వయసున్నప్పుడే గుండె సంబం ధిత సమస్యలు వెలుగులోకి వచ్చిందని నారాయణ హెల్త్ వ్యవ స్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి తెలిపారు. నాలుగు నెలలపాటు చికిత్స లు కొనసాగాయని, అయితే గుండెమార్పిడి అవసరమని గుర్తిం చామన్నారు., అందుకు తగిన దాత అందుబాటులోకి రావడంతో ఆపరేషన్ సాధ్యమైందన్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నారన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..
ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ
ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్
Read Latest Telangana News and National News