Belly Fat: ఉదయాన్నే ఈ పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా చాలు.. పొట్ట కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది..!
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:50 PM
ఉదయాన్నే ఈ పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట.
పొట్ట కొవ్వు ఈ మధ్యకాలంలో చాలా సాధారణం అయిపోయింది. చాలామందికి సిట్టింగ్ వర్క్ ఉండటం మూలాన, జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల చాలా సులువుగా పొట్ట వస్తోంది. కొందరికి చిన్న వయసులోనే బాన లాంటి పొట్ట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటివారు పొట్ట తగ్గించుకోవడానికి వ్యాయామాలు, జిమ్ అన్నీ ట్రై చేస్తుంటారు. అలాగే ఆహారంలో కూడా చాలా మార్పులు చేసుకుంటారు. అయితే ఉదయాన్నే కింద చెప్పుకునే పానీయాలలో ఏ ఒక్కటి తాగుతున్నా పొట్ట కొవ్వు ఐస్ లాగా కరిగిపోతుందట. అవేంటో తెలుసుకుంటే..
100 Times Washed Ghee: శత ధౌత ఘృత లేదా 100సార్లు కడిగిన నెయ్యి.. దీని బెనిఫిట్స్ ఏంటంటే.. !
తేనె, నిమ్మ నీరు..
బరువు తగ్గడానికి చాలామంది ఫాలో అయ్యే పానీయం ఇది. పొట్ట, నడుము చుట్టుకొలతను తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం శరీరాన్ని డిటాక్సిపై చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పొట్ట కొవ్వు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో అరస్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలపాలి. దీన్ని ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి తాగాలి.
జీరా నీరు..
జీలకర్రలో థైమోక్వినోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీలకర్రను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగవచ్చు. లేదంటే.. జీలకర్రను నీటిలో వేసి మరిగించి వడగట్టి తాగవచ్చు. జీలకర్ర పొడిని నీటిలోనూ, మజ్జిగలోనూ కలిపి తాగవచ్చు. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Hair Oil: ఉల్లిపాయ నూనె లేదా వెల్లుల్లి నూనె.. జుట్టు మందంగా, ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె మంచిదంటే..!
మజ్జిగ..
వేసవికాలంలో శరీరం హైడ్రేట్ గా ఉండటానికి చాలామంది ఎంచుకునే పానీయం మజ్జిగ. భారతీయులకు మజ్జిగ ఒక ఎమోషన్. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇది విటమిన్-బి12 పోషకాల శోషణను పెంచుతుంది. మజ్జిగలో ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి జోడించి తీసుకోవడం వల్ల బరువు తగ్గడం ఇంకా సులువుగా ఉంటుంది.
దాల్చిన చెక్క టీ..
దాల్చిన చెక్కను పొడిగా చేసి ఒక గ్లాసు వేడి నీటిలో వేసి తాగాలి. ఇది పొట్ట కొవ్వు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కేవలం ఉదయమే కాదు.. సాయంత్రం కూడా దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు శరీరాన్ని డిటాక్స్ చేస్తూ మరోవైపు బరువు తగ్గడంలో, పొట్ట కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
Rose Water: రోజ్ వాటర్ ను ఇలా వాడి చూడండి.. డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
గ్రీన్..
ఆరోగ్య స్పృహ పెరిగిన వారు పాలతో చేసిన కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ తీసుకుంటారు. గ్రీన్ టీ కేలరీలు బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇందులో కాటెచిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి కొవ్వును బర్న్ చేయడంలో సహాయపడుతుంది.
ఇవి కూడా చదవండి..
రోజూ నానబెట్టిన పెసరపప్పు తింటే ఏం జరుగుతుందంటే.. !
హార్మోన్లను బ్యాలెన్స్ గా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవి..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.