Share News

Health Tips: ఖర్జూరం ఇలా తింటే.. ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా?

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:54 PM

ఒంట్లో నలతగా ఉంటే ఖర్జూరం తిను అని చెప్తుంటారు పెద్దలు. అదీగాక తియ్యటి రుచితో నోరూరించే ఈ పండు అంటే ఎవరికైనా ఇష్టమే. దీంతో ఈ సమయం అని కాకుండా వీలు కుదిరినప్పుడల్లా తింటూ ఉంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు జరగడానికి బదులుగా ఎన్నో అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 90 శాతం మంది ఖర్జూరాలను తినేటప్పుడు ఇదే తప్పు చేస్తున్నారు. ఇలా తప్పుడు పద్ధతిలో తీసుకుంటే ఏమవుతుందంటే..

Health Tips: ఖర్జూరం ఇలా తింటే.. ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా?
Dates Uses

ఒంట్లో నలతగా ఉంటే ఖర్జూరం తిను అని చెప్తుంటారు పెద్దలు. అదీగాక తియ్యటి రుచితో నోరూరించే ఈ పండు అంటే ఎవరికైనా ఇష్టమే. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ సమయం అని లేకుండా వీలు కుదిరినప్పుడల్లా డేట్స్ తినేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు తింటే మేలు జరగడానికి బదులుగా ఎన్నో అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుందని హెచ్చరిస్తున్నారు పోషకాహార నిపుణులు. 90 శాతం మంది ఖర్జూరాలను తినేటప్పుడు ఇదే తప్పు చేస్తున్నారని... ఇలా చేయటం వల్ల ఆరోగ్యానికి మేలు జరగకపోగా కీడే ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. డేట్స్‌ను సరైన సమయంలో, సరైన విధానంలో తీసుకున్నప్పుడే దీని ప్రయోజనాలు మనకందుతాయని, లేకపోతే నష్టాలే ఎక్కువ ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే, ఖర్జూరం తినేటప్పుడు దాదాపు 90 శాతం మంది ఇలాగే చేస్తున్నారు. ఇది చాలాపెద్ద తప్పు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంత హాని జరుగుతుందో మీకు తెలుసా?


అలసటను దూరం చేసి తక్షణ శక్తిని ప్రసాదించి మనసును, శరీరాన్ని చురుగ్గా పనిచేసేలా చేస్తుంది ఖర్జూరం. అందుకే దీన్ని సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు నిపుణులు. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు, ఖనిజాలు రోగనిరోధకశక్తిని పెంచి అనారోగ్యాల బారిన పడకుండా కాపాడతాయి. తినగానే ఒత్తిడి, ఆందోళన దూరం మటుమాయం అయ్యేలా చేసి ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. తరచూ రక్తహీనత సమస్యతో బాధపడే మహిళలకు డేట్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులోని ఐరన్, క్యాల్షియం ఎముకల గుల్లబారకుండా చేస్తాయి. జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రుచిలో తియ్యగా ఉన్నా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూడటం దీనికున్న మరో ప్రత్యేకత. రొమ్ము, ఊపిరితిత్తుల వంటి క్యాన్సర్లను నిరోధించగల శక్తి ఖర్జూరానికుంది.


మరి, ఇన్ని ప్రయోజనాలున్న ఖర్జూరాన్ని ఎలా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి అనేది కింద ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుసుకోండి.

ఖాళీ కడుపుతో తింటే..

పొద్దున లేవగానే ఖర్జూరం తింటే మంచిదని చాలా మంది భావిస్తారు. రోజుకు 6 లేదా 7 మాత్రమే తినాలి. ఎండు ఖర్జూరాలు అయితే 2 తీసుకోవాలి. పరిమితికి మించి తిన్నారో అది మీకు చాలా ప్రమాదకరం. ఖాళీ కడుపుతో ఎక్కువగా ఖర్జూరం తింటే గ్యాస్, అసిడిటీ సమస్యలు రావచ్చు. మరీ ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయులు అకస్మాత్తుగా పెరిగి ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే, ఖర్జూరాల్లో 90% చక్కెర ఉంటుంది. కాబట్టి, ఖాళీ కడుపుతో అధిక మొత్తంలో డేట్స్ తీసుకోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

బరువుపైన ప్రభావం..

మోతాదు మించకుండా ఖర్జూరం తింటే బరువు తగ్గటంతో పాటు గుండె, కాలేయం సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. లేకపోతే అధిక బరువుకు కారణమవుతుంది.


భోజనం తర్వాత..

అధిక ఫైబర్ ఉన్నందున ఖర్జూరాలు జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది. భోజనం తర్వాత డేట్స్ తీసుకుంటే కడుపు నిండుగా అయినట్టు అనిపించి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇలా చేయడం జీర్ణవ్యవస్థపైన ప్రభావం చూపుతుంది.

కిడ్నీ సమస్యలు..

డ్రై ఫ్రూట్స్‌లో పొటాషియం, కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరిగేందుకు కారణమవుతాయి. కిడ్నీ సమస్యలు, అలర్జీలతో బాధపడేవారు వైద్యుల సలహామేరకు డేట్స్ తీసుకోవాలి.


ఆస్థమా ఉంటే..

ఖర్జూరంలో ఉండే సల్ఫేట్లు ఆస్థమా, శ్వాస సమస్యలు మరింతగా పెరిగేలా చేస్తాయి.

ఫ్రిజ్‌లో ఉంచి తింటే..

సాధారణంగా చాలామంది ఖర్జూరాలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతుంటారు. అయితే, ఫ్రిజ్‌లో 6 నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచిన డేట్స్ తినటం ఆరోగ్యానికి మంచిది కాదు.

Updated Date - Dec 28 , 2024 | 04:54 PM