Blood Sugar: ఈ వెజిటేరియన్ ఆహారాలు తీసుకుంటే చాలు.. రక్తంలో చక్కెర స్తాయిలు సేఫ్..!
ABN , Publish Date - Jun 15 , 2024 | 10:27 AM
ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువ కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణమైపోయి, కేలరీలు ఖర్చైపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. కార్బోహైడ్రేట్స్ అని, కొలెస్ట్రాల్ అని, కేలరీలు అని లెక్క గట్టుకుని మరీ తినాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి చాలా కష్టపడుతుంటారు. అయితే..
మధుమేహం.. ఈ ఒక్క సమస్య లేకపోతే ఆహారం విషయంలో ఎవ్వరూ నియంత్రణలో ఉండేవారు కారేమో. ఒకప్పుడు శారీరక శ్రమ ఎక్కువ కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణమైపోయి, కేలరీలు ఖర్చైపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. కార్బోహైడ్రేట్స్ అని, కొలెస్ట్రాల్ అని, కేలరీలు అని లెక్క గట్టుకుని మరీ తినాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి చాలా కష్టపడుతుంటారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే వెజిటేరియన్ సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
చియా విత్తనాలు..
చియా గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.
మహిళలలో ఐరన్ లోపం ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
ఆకుకూరలు..
బచ్చలికూర, పాలకూర, తోట కూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో తక్కువ కేలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఫైబర్, మెగ్నీషియం అదికంగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
క్వినోవా..
క్వినోవా ఈ మద్యకాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉన్న తృణధాన్యం ఇది. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు శక్తిని అందిస్తుంది.
Chia Seeds: ఆరోగ్యానికి మంచిది కదా అని చియా విత్తనాలు ఎక్కువ తింటే.. ఏం జరుగుతుందంటే..!
స్వీట్ పొటాటో..
చిలగడదుంపలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బంగాళదుంపల కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయి.
ఈ మొఘల్ మహారాణుల తెలివితేటలు తెలిస్తే షాకవుతారు..!
ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.