Share News

Figs Health Benefits: అంజీర వాటర్.. ఇలా తాగితే సగం రోగాలు మటుమాయం..

ABN , Publish Date - Dec 12 , 2024 | 01:51 PM

డ్రైఫ్రూట్స్ లో అంజీర గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పుకున్నా తరిగి పోనన్ని లాభాలున్నాయి. రోజూ ఉదయాన్నే అంజీరను ఈ విధంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు...

Figs Health Benefits: అంజీర వాటర్.. ఇలా తాగితే సగం రోగాలు మటుమాయం..
Figs

ఆరోగ్యాన్ని గాఢిలో పెట్టడంలో డ్రై ఫ్రూట్స్ ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది.. కాజు, బాదం, పిస్తా, వాల్ నట్స్, కిస్మిస్.. కానీ వీటి ప్రయోజనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్నో పోషకాలు కలిగిన మరో పదార్థం కూడా ఉంది. అదే అంజీర. ఆయుర్వేదంలోనూ అంజీరకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. దీన్ని డ్రై ఫ్రూట్స్ లాగానే కాకుండా పండుగా ఉన్నప్పుడు కూడా తింటారు. అయితే, వీటిని నేరుగా తినడమే కాకుండా అంజీరను నానబెట్టిన నీళ్లను తాగినా ఎన్నో రకాల రోగాలు మటుమాయం అవుతాయని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..


గుండె ఆరోగ్యానికి..

అంజీరను రాత్రంతా నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల ముందుగా గుండెకు ఎంతో మేలు చేసస్తుంది. బ్లడ్ ప్రెజర్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఒమెగా 3, 6 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె జబ్బులను నయం చయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఎముకల ధృఢత్వానికి..

అంజీరను రాత్రంతా నానబెట్టడం వల్ల ఆ నీరు కాల్షియంను ఎక్కువగా గ్రహిస్తుంది. అందువల్ల ఈ నీరు ఎములకు బలాన్నిస్తుంది. జాయింట్లను పటిష్టం చేసి ఎక్కువకాలం యాక్టివ్ గా ఉండేట్టు చేస్తుంది.

షుగర్ ఉన్నవారికి...

డయాబెటిస్ పేషంట్లు స్వీట్లు, తీయగా ఉండే పండ్లు తినడం శ్రేయస్కరం కాదు. కానీ, వారు నిరభ్యంతరంగా అంజీరను డైట్ లో భాగం చేసుకోవచ్చు. ఇందులో ఉండే పొటాషియం స్థాయిలు బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని సైతం బ్యాలెన్స్ చేసి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.


అజీర్తికి అంజీర..

అంజీరను రోజూ తినడం వల్ల మలబద్దకం సమస్యే ఉండదు. వీటిని నానబెట్టిన నీటిని తాగిన ఈ సమస్య నుంచి వెంటనే రిలీఫ్ లభిస్తుంది. పేగుల కదలికలను సులభతరం చేసి మోషన్ ఫ్రీగా అయ్యేలా చసే లాక్సేటివ్ ప్రాపర్టీస్ అంజీర నీటిలో ఉన్నాయి. అందువల్ల ఈ సింపుల్ రెమిడీని ఓసారి ట్రై చేసి చూడండి.

రక్తహీనత రానేదారు..

అంజీర తినడం వల్ల పేగుల్లో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇది లంగ్స్ ప్రాబ్లమ్స్ ను తగ్గిస్తుంది. అలాగే రక్తహీనత దరిచేరకుండా చేయడంలో అంజీరది కీలక పాత్ర. రక్తహీనత కారణంగా ఏర్పడే జట్టు రాలడం, నీరసం, చర్మం పాలిపోయినట్టుగా ఉండటం, బరువు తగ్గిపోవడం వంటి అన్ని సమస్యలకు అంజీర రామబాణంలా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తోంది.

ఎప్పుడు ఎలా తీసుకోవాలి..

రెండు లేదా మూడు అంజీరలను సగానికి కట్ చేయాలి. రాత్రంతా వీటిని నీటిలో వేసి నానబెట్టాలి. పొద్దునే ఆ నీటిని కాస్త మరిగించి సగం క్వాంటిటీ అయ్యేలా చూడాలి. నీటిని తాగేసిన తర్వాత అంజీరను మంచిగా నమిలి తినాలి. ఆరోగ్యంగా ఉన్నవారెవరైనా రోజుకు రెండు నుంచి మూడు అంజీరలను తినొచ్చు.

Glowing skin: శీతాకాలంలో మెరిసే చర్మం కోసం.. ఇంట్లోనే సులభంగా చేసుకునే చిట్కాలు మీ కోసం..


Updated Date - Dec 12 , 2024 | 01:52 PM