Share News

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పడుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!

ABN , Publish Date - Oct 05 , 2024 | 11:35 AM

డ్రై ఫ్రూట్స్ కు పురుగు పట్టకూడదు అంటే ఇలా చేయాలి.

Dry Fruits: డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పడుతున్నాయా?  ఈ సింపుల్ టిప్స్ పాటించండి..!
dry fruits

డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవి. కానీ ఇవి తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, శక్తి, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ ను కొన్న తరువాత చాలామంది ఫేస్ చేసే సమస్య వాటికి పురుగులు పట్టడం. బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు మొదలైన డ్రై ఫ్రూట్స్ సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. వివిధ వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటికి పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.

వెల్లుల్లి నీటిని ప్రతిరోజూ తాగుతుంటే శరీరంలో కలిగే మార్పులు ఇవే..


  • డ్రై ఫ్రూట్స్ కు పురుగులు పట్టకూడదు అంటే వాటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచాలి. గాజు, ప్లాస్టిక్, మెటల్.. ఇలా ఏదైనా సరే.. ఎయిర్ టైట్ కంటైనర్ లోనే ఉంచాలి. పొరపాటున కూడా డ్రై ఫ్రూట్స్ ను అలాగే ఓపెన్ చేసిన కవర్ లోనూ, పేపర్లలోనూ చుట్టి ఉంచకూడదు. దీని వల్ల పురుగులు పడతాయి.

  • డ్రై ఫ్రూట్స్ ను కొనుగోలు చేసేటప్పుడు వాటి వాసన చూడాలి. కాస్త ముక్కిపోయిన వాసన వచ్చినా సరే అస్సలు కొనకూడదు. నిజానికి ఇలాంటి వాటినే ఆఫర్ల కింద అమ్ముతుంటారు. ఇలాంటి వాటికే పురుగులు కూడా త్వరగా పడుతుంటాయి. కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొనే విషయంలో జాగ్రత్త ముఖ్యం.

  • డ్రై ఫ్రూట్స్ ను లూజ్ గా ఎప్పుడూ కొనకూడదు. వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేసినవే కొనాలి. ఇవే ఆరోగ్యం కూడా.

  • డ్రై ప్రూట్స్ ను ఒకే సారి ఎక్కువ పరిమాణంలో కొనకూడదు. కావలసినప్పుడు లేదా నెలవారి సరుకులు తీసుకునేటప్పుడు సరిపడా తెచ్చుకోవడం మంచిది.

  • ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా చేస్తే ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి.

ఇవి కూడా చదవండి..

రోజులో ఎండుద్రాక్ష ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యమంటే..!

Vitamin-B12: విటమిన్-బి12 సప్లిమెంట్లు వాడుతున్నారా? వీటిని తీసుకోవడానికి సరైన సమయం తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 05 , 2024 | 11:35 AM