Share News

Egg Mayonaise: కోడిగుడ్డు మయోనైస్ ను బ్యాన్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.. ఎందుకంటే..

ABN , Publish Date - Oct 23 , 2024 | 04:22 PM

మయోనైస్ ను ఆహారంలో చాలా రకాలుగా. ఇది చాలా రకాల పదార్థాలకు అదనపు రుచిని ఇస్తుంది. అయితే మయోనైస్ ను తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసే యోచనలో ఉంది. అసలు కారణాలు ఇవీ..

Egg Mayonaise: కోడిగుడ్డు మయోనైస్ ను బ్యాన్ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచన.. ఎందుకంటే..
Egg Mayonaise

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తో పాటు ఇప్పటికాలం విదేశీ ఆహారాలను ఇష్టపడే వారికి మయోనైస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. కొన్ని స్నాక్స్ ను డిప్ చేసి తినడానికి, సలాడ్ లలోనూ, పిజ్జా, షావర్మా, శాండ్విచ్ మొదలైన వాటిలోనూ మయోనైస్ ను అధికంగా వినియోగిస్తుంటారు. తెల్లగా, క్రీమ్ లాగా ఉండే మయోనైస్ ఆహారానికి అదనపు రుచిని ఇస్తుంది. నిజానికి మయోసైస్ లో రెండు రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి గుడ్డు ఆధారిత మయోనైస్.. గుడ్డు సొనను బాగా బ్లెండ్ చేయడం ద్వారా తెల్లని క్రీమ్ ను తయారుచేస్తారు. ఇందులో రుచి కోసం వివిధ రకాల మసాలా దినుసులు జోడిస్తారు. గుడ్డు ఆధారిత మయోనైస్ వినియోగాన్ని బ్యాన చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి గల కారణాలు ఇలా ఉన్నాయి.

నెయ్యి తీసుకుంటే షుగర్ కంట్రోల్ ఉంటుందా.. అసలు నిజాలివీ..


తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగానే గుడ్డు ఆధారిత మయోనైస్ ను బ్యాన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో కనీసం పది ఫుడ్ పాయిజన్ కేసులు గుడ్డు ఆధారిత మయోనైస్ తో జరిగాయని తెలంగాణ ఆహార భద్రత అధికారులు నివేదించారు.

తాజాగా సికింద్రాబాద్ కు చెందిన నలుగురు వ్యక్తులు గుడ్డు ఆధారిత మయోనైస్ జోడించి తయారు చేసిన షావర్మాను తిని తీవ్రమైన విరేచనాలు, వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ కారణంగా మయోనైస్ ను నిషేధించే దిశగా తెలంగాణ ప్రభుత్వ ఆహార భద్రతా అధికారుల ఆలోచనలు సాగుతున్నారు. ఇదే కనుక నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయబడిన మొదటి ఆహార ఉత్పత్తి గుడ్డు ఆధారిత మయోనైస్ అవుతుంది. 2023లో లాబొరేటరీలో మార్కెట్ లో వినియోగించే మయోనైస్ ను పరీక్షించారు. ఈ పరీక్షలలో పచ్చి గుడ్ల నుండి తయారయ్యే మయోనైస్ తో హానికరమైన సూక్ష్మక్రిములు ఉన్నట్టు గుర్తించారు. ఈ కారణంగా ఇప్పటికే పచ్చి గుడ్ల నుండి తయారయ్యే మయోనైస్ ను కేరళ రాష్ట్రం నిషేధించింది. భారతదేశంలో గుడ్ల ఆధారిత మయోనైస్ ను నిషేధించిన మొదటి రాష్ట్రం కూడా కేరళనే.

Moringa Rice: ఆరోగ్యాన్ని, ఆయుష్షును పెంచే మునగాకు రైస్.. చాలా రుచిగా ఇలా చేసేయండి..


కేవలం గుడ్ల ఆధారిత మయోనైస్ విషయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత దృష్ట్యా ఆహార భద్రతా అధికారులు వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహిస్తున్నారు. పాల సేకరణ, విక్రయ ప్రాంతాలతో పాటు.. పాలు, పెరుగు, పనీర్ వంటివి తయారీ, అమ్మకాల దగ్గర తనిఖీలు జరుగుతున్నాయి. పలు పాస్ట్ పుడ్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్లు, ప్యారడైజ్ లతో సహా చాలా చోట్ల దాడులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

Oats Vs Daliya: ఓట్స్ లేదా గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..

Health Tips: ఒక్క స్పూన్ వాము గింజలతో యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చట.. ఇంతకీ ఎలా వాడాలంటే..

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 23 , 2024 | 04:22 PM