Share News

Eye Sight: మీ కంటి చూపు పదునుగానే ఉందా? ఈ ఆహారాలు తినండి.. గ్రద్దలాంటి చూపు మీ సొంతం..!

ABN , Publish Date - Sep 14 , 2024 | 12:51 PM

"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్నారు. కళ్లు ఆరోగ్యంగానూ, కంటి చూపు మెరుగ్గానూ ఉంటే చాలా జీవితంలో చాలా ఇబ్బందులు తప్పుతాయి.

Eye Sight:  మీ కంటి చూపు పదునుగానే ఉందా? ఈ ఆహారాలు తినండి.. గ్రద్దలాంటి చూపు మీ సొంతం..!
Eye Sight

"సర్వేంద్రియానాం నయనం ప్రధానం" అన్నారు. కళ్లు ఆరోగ్యంగానూ, కంటి చూపు మెరుగ్గానూ ఉంటే చాలా జీవితంలో చాలా ఇబ్బందులు తప్పుతాయి. కానీ నేటి కాలంలో కంటి చూపు బలహీనంగా ఉన్నవారే ఎక్కువ. చిన్న వయసులోనే కళ్లద్దాలు పెట్టుకుని కనిపించేవారు ఎక్కువ. ఫోన్, టీవీ, కంప్యూటర్.. మొదలైన స్క్రీన్ టైం ఎక్కువ కావడం వల్ల కంటి చూపు బలహీనం అవుతుంది. కంటి చూపుకు అవసరమైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు బలహీనంగా ఉంటుంది. కంటిచూపు పదునుగా ఉండాలన్నా, గ్రద్ద లాంటి చూపు సొంతం కావాలన్నా కింది ఆహారాలు తీసుకోవాలి.

తక్కువగా నిద్రపోతే చర్మం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?


పచ్చని ఆకుకూరలు..

ఆకుకూరలు తింటే కంటి చూపు మెరుగ్గా ఉంటుందని అంటారు. లుటిన్, జియాక్సంతిన్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు ఆకుపచ్చ కూరగాయలలో కనిపిస్తాయి. ఇవి సూర్యుడి హానికరమైన కిరణాల నుండి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి.

వాల్నట్స్..

వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాల్నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కళ్ల వాపులు తగ్గించడంలో సహాయపడతాయి. రెటీనాకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ నానబెట్టిన వాల్నట్స్ ను తింటూ ఉంటే కంటి చూపు బలపడుతుంది.

చిలగడదుంపలు..

చిలగడదుంపలను స్వీట్ పొటాటో అంటారు. చిలకడదుంపలలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది. కళ్లు పొడిబారడాన్ని ఇది తగ్గిస్తుంది. కంటి చూపును బలంగా ఉంచుతుంది.

ఈ ఆహారాలు తీసుకోండి.. అధిక కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది..!


గుడ్లు..

గుడ్లలో కంటికి ఆరోగ్యం చేకూర్చే లూటిన్, జియాక్సంతిన్ లతో పాటూ విటమిన్-ఎ, జింక్ కూడా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

నారింజ..

నారింజ పండ్లలో అధిక మొత్తంలో విటమిన్-సి ఉంటుంది. ఇది కంటి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది. కంటి చూపును బలంగా మారుస్తుంది.

బాదం..

బాదం పప్పు కూడా కంటి చూపును పదును చేస్తుంది. బాదం పప్పు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కంటి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి..

పియర్ పండ్లు తింటే.. ఈ సమస్యలన్నీ నయమవుతాయట..!

Gas Problem: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా చేస్తే నిమిషాలలో తగ్గిపోతుంది..!

Parenting: తల్లిదండ్రులు రోజూ ఈ పనులు చేస్తుంటే చాలు.. జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Sep 14 , 2024 | 12:51 PM