Share News

Diabetes: ఈ చిట్కాలతో ఈజీగా డయాబెటిస్‌ను నియంత్రించండి

ABN , Publish Date - Nov 03 , 2024 | 07:28 PM

ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది మనం జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. రోజూ మాత్రలు వేసుకోవల్సి ఉంటుంది. డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. షుగర్ వ్యాధి బారినపడిన తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా ..

Diabetes: ఈ చిట్కాలతో ఈజీగా డయాబెటిస్‌ను నియంత్రించండి
Diabetes

ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సిందే. మధుమేహం బారిన పడకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమం. అలాకాకుండా ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే అది మనం జీవించి ఉన్నంతకాలం మనతోనే ఉంటుంది. రోజూ మాత్రలు వేసుకోవల్సి ఉంటుంది. డయాబెటిస్‌ను పూర్తిగా తగ్గించే చికిత్స ఇప్పటివరకు లేదు. ఒకసారి వచ్చిందంటే అది ఎప్పటికీ ఉంటుంది. షుగర్ వ్యాధి బారినపడిన తర్వాత కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఎంత డేంజర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యాధి శరీరాన్ని లోపల నుండి తినేస్తుంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని అంటారు. రక్తంలో హై గ్లూకోజ్ లెవల్స్ పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎవరికైనా, ఏ వయసులోనైనా డయాబెటిస్ రావొచ్చు. చిన్న పిల్లల్లో కూడా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను నియంత్రించకపోతే, గుండె జబ్బులు, కంటి సమస్య, నరాల సమస్యలతో పాటు తీవ్రమైన కిడ్నీ , కాలేయం సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Hemant Soren: మేము గెలిస్తే నెలకు 7 కేజీల రేషన్, పింఛన్ పెంచుతాం


డయాబెటిస్ లక్షణాలు..

అతిమూత్రం, దాహం పెరగడం, చూపు మందగించడం, కారణం లేకుండా బరువు తగ్గడం, బద్ధకంగా అనిపించడం డయాబెటిస్ లక్షణాలు. ఈ వ్యాధిలో మొత్తం మూడు రకాలు ఉంటాయి. డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్. కొంతమందికి వంశపారంపర్యంగా ఈ వ్యాధి వస్తుంది. మరికొంతమందికి కొన్ని రకాల మందుల వాడకానికి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఈ సమస్య వస్తుంది. గంటలు తరబడి కూర్చోడం, పోషకాలు లేని ఆహారం, కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధి వస్తుంది.

Kerala: రైల్వే ట్రాక్‌పై విషాదం.. నలుగురు మృతి


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మధుమేహాన్ని నియంత్రించేందుకు ఆయుర్వేదం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఉసిరికాయ తినడం ఎంతో మేలు అని.. ఇందులో విటమిన్ -సి ఉంటుందని, ఇది రోగనిరోధిక వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే, కాకరకాయ తినడం ద్వారా ఎంతో ప్రయోజనకరం అని, దానిలోని చేదు.. గ్లూకోజ్ వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు. పసుపు, మెంతులు, నేరేడుపండు ఇవన్నీ కూడా మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు కనీసం అరగంటైనా వర్కౌట్ చేయాలని.. ఒకే సమయానికి తినడం అలవాటు చేసుకోవాలని, జంక్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ ఫుడ్స్, డ్రింక్స్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు శరీరానికి, మనసుకి విశ్రాంతి ఇవ్వాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


Delhi Air Pollution: 500 మార్క్ దాటిన ఢిల్లీ వాయు కాలుష్యం.. స్థానికుల భయాందోళన

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Nov 03 , 2024 | 07:46 PM