Share News

Guava Leaf Tea: జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివి..!

ABN , Publish Date - Aug 11 , 2024 | 02:28 PM

జామ పండ్లు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామ ఆకుల్లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. చాలా మంది గ్రీన్ టీ, పుదీనా టీ వంటివి తాగుతూ ఉంటారు.. కానీ

Guava Leaf Tea: జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే జరిగేదేంటి? మీకు తెలియని నిజాలివి..!
Guava leaf tea

జామ పండ్లను పేదవాడి యాపిల్ గా పిలుస్తారు. యాపిల్ పండ్లలో ఉండే పోషకాలన్నీ దాదాపు జామ పండ్లలో కూడా ఉంటాయి. ఈ కారణంగా ఇవి యాపిల్ పండ్లతో సమానమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. అయితే జామ పండ్లు మాత్రమే కాదు.. జామ ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామ ఆకుల్లో విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. చాలా మంది గ్రీన్ టీ, పుదీనా టీ వంటివి తాగుతూ ఉంటారు.. కానీ జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే షాకింగ్ ఫలితాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు. ఒక పాత్రలో కొన్ని నీరు పోసి అందులో జామ ఆకులను వేసి బాగా మరిగించాలి. దీన్ని ఫిల్టర్ చేసి తాగాలి. జామ ఆకుల టీ తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

Walnuts Vs Almonds: వాల్నట్స్ లేక బాదం గింజలు.. రెండింటిలో ఆరోగ్యానికి ఏవి ఎక్కువ మేలు చేస్తాయంటే..!



చెడు కొలెస్ట్రాల్..

చెడు కొలెస్ట్రాల్ చాలా అనారోగ్యాలకు కారణం అవుతుంది. కొలెస్ట్రాల్ అవసరానికి మించి పెరిగితే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి జామ ఆకుల టీని తాగవచ్చు.

డయేరియా..

విరేచనాలు అయినప్పుడు జామ ఆకుల టీ తాగవచ్చు. జామ ఆకు టీ అతిసారం వల్ల వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

బరువు..

అధిక బరువుతో ఇబ్బంది పడేవారు బరువు తగ్గడానికి జామ ఆకులతో టీ తయారు చేసి తాగవచ్చు. జామ ఆకుల టీ తాగడం వల్ల పొడుచుకు వచ్చిన పొట్ట కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇది జీవక్రియను కూడా పెంచుతుంది.

Herbal Tea: ఈ హెర్భల్ టీలు తాగండి.. ఎంత ఈజీగా బరువు తగ్గుతారంటే..!



దగ్గు, జలుబు..

జామ ఆకుల టీ తీసుకోవడం వల్ల జలుబు దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది. ఈ ఆకుల్లో ఉండే విటమిన్ సి, ఐరన్ గుణాలు సీజనల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి. జామ ఆకు టీ గొంతు, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను శుద్ది చేస్తుంది.

చర్మం, జుట్టు..

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జామ ఆకులు ప్రభావవంతంగా ఉంటాయి. జామ ఆకులు ముఖ కండరాలను బిగించడంలో కూడా ప్రభావాన్ని చూపుతాయి. ఇది మాత్రమే కాకుండా ఈ ఆకుల టీ వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది. జామ ఆకు టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

అరచేతులను రుద్దితే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా..?

ప్రతిరోజూ సూర్య నమస్కారాలు వేస్తే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 11 , 2024 | 02:34 PM