Share News

Health Tips: అన్నం వండేముందు బియ్యాన్ని నానబెట్టడం మంచిదేనా? వైద్యులు చెప్పిన నిజాలేంటంటే..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:22 PM

కొందరు అన్నాన్ని వండే ముందు కొందరు బియ్యాన్ని కడిగి అన్నం వండేస్తుంటారు. మరికొందరు మాత్రం బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెడతారు కూడా. అన్నం వండేముందు ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే..

Health Tips:  అన్నం వండేముందు బియ్యాన్ని నానబెట్టడం మంచిదేనా?  వైద్యులు చెప్పిన నిజాలేంటంటే..!

భారతదేశ ప్రజలకు అన్నం ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల భోజనంలో అన్నానికే పెద్ద పీట వేస్తారు. కొన్ని చోట్ల మూడు పూటలా అన్నమే తినేవారున్నారు. అయితే అన్నాన్ని వండే ముందు కొందరు బియ్యాన్ని కడిగి అన్నం వండేస్తుంటారు. మరికొందరు మాత్రం బియ్యాన్ని కడిగి కొద్దిసేపు నానబెడతారు కూడా. అన్నం వండేముందు ఇలా బియ్యాన్ని నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా ఏమైనా లాభాలుంటాయా? దీని గురించి ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలు తెలుసుకుంటే..

గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలో కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని ఎంత త్వరగా పెంచుతుందో కొలిచే మార్గం. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. ఇది నిరంతర శక్తిని అందిస్తుంది. బియ్యాన్ని నానబెట్టడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచే ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ అవుతుంది. ఇదే గ్లైసెమిక్ ఇండెక్స్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


బియ్యం నానబెట్టినప్పుడు బియ్యంలో ఎంజైమాటిక్ బ్రేక్డౌన్ ఏర్పడుతుంది. ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ అనేది బియ్యం గింజలలో సహజంగా ఉండే కొన్ని ఎంజైమ్‌లు సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను సాధారణ గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేసే ప్రక్రియ. ఈ ఎంజైమాటిక్ చర్య అన్నాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, ఆహారంలోని పోషకాలను శరీరం సులువుగా గ్రహించేలా చేస్తుంది.

ఎంజైమాటిక్ బ్రేక్‌డౌన్ ఫైటిక్ యాసిడ్, టానిన్‌ల వంటి యాంటీ న్యూట్రియంట్‌లను విచ్ఛిన్నం చేస్తుంది. శరీరానికి విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బియ్యాన్ని నానబెట్టడం వల్ల పోషకాల శోషణ మెరుగుపడుతుంది.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?


బియ్యాన్ని నానబెట్టడం వల్ల ప్రయోజనాలే కాదు.. దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

మధుమేహం ఉన్నవారు పరిమిత పరిమాణంలో అన్నం తినాలి. బియ్యం వండడానికి ముందు నాలుగు గంటల కంటే ఎక్కువ సేపు బియ్యాన్ని నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల కొన్ని విటమిన్లు, ఖనిజాలు నీటిలో కరిగిపోతాయి. నానబెట్టిన బియ్యాన్ని వండే ముందు బాగా కడగాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు పిండిపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

6 సెకెన్ల ముద్దుకు ఇంత పవరుందా?

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 08 , 2024 | 03:22 PM