Hyderabad: ప్రభుత్వ వైద్యుడికి ఉస్మానియాలో కాలేయ మార్పిడి
ABN , Publish Date - Sep 27 , 2024 | 10:19 AM
ఇంతకాలం ఖరీదైన శస్త్రచికిత్సగా పేరున్న అవయవమార్పిడి.. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో ఉచితంగా లభ్యమవుతోంది. తాజాగా.. కాలేయం చెడిపోయిన ఓ ప్రభుత్వ వైద్యుడి ప్రాణాలను అవయవదానం నిలిపింది.
హైదరాబాద్ సిటీ: ఇంతకాలం ఖరీదైన శస్త్రచికిత్సగా పేరున్న అవయవమార్పిడి.. ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో ఉచితంగా లభ్యమవుతోంది. తాజాగా.. కాలేయం చెడిపోయిన ఓ ప్రభుత్వ వైద్యుడి ప్రాణాలను అవయవదానం నిలిపింది. ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్‌కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్, ప్రొఫెసర్ మధుసూదన్ వివరాలను వెల్లడించారు. సూర్యాపేట వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రవిసుందర్(45) కాలేయం వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా పూర్తిగా వైఫల్యంచెందింది. దీంతో ఆయన గత నెల నుంచి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
వేర్వేరు ఇబ్బందుల కారణంగా.. ఔషధాలతో సమస్య పరిష్కారం కాదని గుర్తించిన వైద్యులు.. కాలేయ మార్పిడికి ప్రతిపాదనలు చేశారు. ఆయన కుటుంబ సభ్యుల రక్తనమూనాలు సరిపోకపోవడంతో.. దాత కోసం ఎదురు చూశారు. గత నెల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై, బ్రెయిన్‌డెడ్(Brain dead) అయిన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన గుంత చెన్నయ్య(25) రక్తనమూనాలు రవిసుందర్‌కు సరిపోతాయని గుర్తించారు. దాంతో.. ఉస్మానియా ఆస్పత్రి జీవన్ దాన్ బృందం చెన్నయ్య కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అవయవదానానికి అంగీకరించడంతో.. గత నెల 29న డాక్టర్ రవిసుందర్‌కు ఆయన కాలేయాన్ని అమర్చారు.
రవిసుందర్ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సిద్దిపేటలోని మద్దూరుకు చెందిన రైతు బత్తిన నరేందర్(45)కు కూడా ఈ నెల 18న కాలేయ మార్పిడి చేశామని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. వైరల్ హైపటైటిస్ కారణంగా ఆయన కాలేయం దెబ్బతిన్నదని వివరించారు. కాగా.. సాధారణంగా అవయవమార్పిడి శస్త్రచికిత్సకు ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చవుతుందని.. ఉస్మానియాలో మాత్రం ఉచితంగా ఆ సేవలను అందిస్తున్నామని వైద్యులు వివరించారు.
ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి
ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి
ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి అజరామరం
ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్..
Read Latest Telangana News and National News