Health: సప్లిమెంట్స్ vs సూర్యరశ్మి.. విటమిన్ డి కోసం ఏది ఉత్తమం..?
ABN , Publish Date - Sep 09 , 2024 | 11:26 AM
Sunlight vs Supplements: దేశంలో 70 శాతం నుంచి 80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ‘విటమిన్ డి’ కోసం ఉత్తమ మార్గంగా సూర్యకిరణాలను పేర్కొంటారు. ఉదయాన్నే సూర్యరశ్మికి నిల్చోవడం వల్ల శరీరంలో విటమిన్ డి వేగంగా ఉత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Sunlight vs Supplements: దేశంలో 70 శాతం నుంచి 80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ‘విటమిన్ డి’ కోసం ఉత్తమ మార్గంగా సూర్యకిరణాలను పేర్కొంటారు. ఉదయాన్నే సూర్యరశ్మికి నిల్చోవడం వల్ల శరీరంలో విటమిన్ డి వేగంగా ఉత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు. విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యమైనది. దీని లోపం వల్ల ఎముకల్లో బలహీనత, అలసట మొదలవుతుంది. అందుకే వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు.. వైద్యులు విటమిన్ డి సప్లిమెంట్లతో లోపాన్ని భర్తీ చేస్తారు. మరి విటమిన్ డి పొందడానికి సూర్యకాంతి, సప్లిమెంట్లలో ఏది ఉత్తమం? దేని ద్వారా శరీరానికి విటమిన్ డి ఎక్కువగా అందుతుంది? ఈ కథనంలో తెలుసుకుందాం.
సూర్యకాంతి:
వ్యక్తి ఉదయం వేళ సూర్యుని వెలుతురుకు నిలబడినట్లయితే.. ఆ సూర్య కిరణాలు చర్మాన్ని తాకుతాయి. అలా తాకిన కిరణాలను చర్మం శోషించుకుంటుంది. చర్మంలోని కొలెస్ట్రాల్‌ను విటమిన్ డి గా మారుతుంది. దీనిని కాలేయం, మూత్రపిండాలు నిర్వహిస్తాయి. తద్వారా శరీరం గ్రహిస్తుంది. విటమిన్ డి ఆహారాల ద్వారా కూడా గ్రహించబడుతుంది. అందుకే.. ఒక వ్యక్తికి తగినంత సూర్యకాంతిలో ఉంటే.. విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత అపార్ట్‌మెంట్ కల్చర్ కారణంగా.. చాలా మంది సూర్యర్శికి దూరమవుతుంది. తద్వారా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.
విటమిన్ డి సప్లిమెంట్స్ ఎలా పని చేస్తాయి?
ఈ సప్లిమెంట్లను సహజంగా విటమిన్ డి ఉత్పత్తి చేయలేని వ్యక్తులు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ సూర్యరశ్మి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నివసిస్తే.. ఈ సప్లిమెంట్లపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సప్లిమెంట్లకు బదులుగా ఉదయం కొన్ని నిమిషాలు సూర్యుని కిరణాల శరీరానికి తగిలేలా నిలబడితే మేలు అని సూచిస్తున్నారు. సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ్య పదార్థాలు పేరుకుపోతాయి. అందుకే సహజసిద్ధంగా విటమిన్ డి ని పొందే మార్గాన్ని ఎంచుకోవడం ఉత్తమం అని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.