Share News

Litchi: వేసవిలో మామిడిని సవాల్ చేసే పండు.. దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

ABN , Publish Date - May 30 , 2024 | 01:43 PM

మామిడి పండు రుచిగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఫైబర్ అన్నీ మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే వేసవి కాలంలో మామిడికి ధీటుగా నిలిచే పండు ఒకటి ఉంది.

Litchi: వేసవిలో మామిడిని సవాల్ చేసే పండు.. దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

వేసవి అనగానే చాలామందికి మామిడి పండే గుర్తొస్తుంది. సీజన్ అయిపోయే వరకు మామిడి పండ్లను ఆస్వాదిస్తూనే ఉంటారు. మామిడి పండు రుచిగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఫైబర్ అన్నీ మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే వేసవి కాలంలో మామిడికి ధీటుగా నిలిచే పండు ఒకటి ఉంది. అదే లిచీ పండు. కేవలం రెండు నెలల కాలం మాత్రమే అందుబాటులోకి వచ్చే ఈ పండు మామిడిని సైతం సవాల్ చేస్తుంది. లిచీ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..

పోషకాలు..

లిచీ పండులో విటమిన్-సి, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషీయం, మాంగనీస్, ఐరన్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!


ప్రయోజనాలు..

లిచీలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుంతుంది.

పొటాషియం సమృద్దిగా ఉండటం వల్ల ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. లిచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి.

లిచీ పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీరంలో నీటి కొరత తగ్గించి శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి.

మెగ్నీషియం, పాస్పరస్, ఐరన్, మాంగనీస్, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉండటం వల్ల లిచీ ఎముకలను బలంగా చేస్తుంది.

పిల్లలు చిన్నతనం నుంచే బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివీ..!


లిచీలో కేలరీలు కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి ఇది మంచిది. ఇందులో ఉండే పీచు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.

ఐరన్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు రక్తప్రసరణను మెరుగు పరచడంలో సహాయపడతాయి. ఇవి ఎర్ర రక్త కణాలు ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయి.

లిచీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనోలిక్ సమ్మేళనాలు శరీర కణాలకు నష్టం వాటిల్లడం, క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. తద్వారా లిచీ తింటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

ఈ 8 రహస్యాలను మరణం వరకు ఎవరికీ చెప్పకూడదట..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 30 , 2024 | 01:43 PM