Share News

Mango Mistakes: మ్యాంగో లవర్స్ కు అలర్ట్.. ఈ ఆహారాలతో మామిడి పండ్లు పొరపాటున కూడా తినకూడదట..!

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:02 AM

మామిడి పండు రుచిగా ఉండటమే కాదు. బోలెడు పోషకాలు కూడా కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. దీంట్లో పైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మామిడి పండ్లు తింటే జీర్ణక్రియ కూడా బాగుంటుంది. అయితే మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఉన్నవారు ప్రతి ఆహారంతోనూ మామిడి పండును కాంబినేషన్ గా మార్చేస్తారు.

Mango Mistakes: మ్యాంగో లవర్స్ కు అలర్ట్..  ఈ ఆహారాలతో  మామిడి పండ్లు పొరపాటున కూడా  తినకూడదట..!

పండ్ల రారాజుగా మామిడిని పేర్కొంటారు. మామిడి పండు రుచిగా ఉండటమే కాదు. బోలెడు పోషకాలు కూడా కలిగి ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. దీంట్లో పైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మామిడి పండ్లు తింటే జీర్ణక్రియ కూడా బాగుంటుంది. అయితే మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం ఉన్నవారు ప్రతి ఆహారంతోనూ మామిడి పండును కాంబినేషన్ గా మార్చేస్తారు. సీజనల్ పండ్లు కావడంతో చాలామందికి మామిడి పండ్లంటే పెద్ద క్రష్ కూడా. అయితే మామిడి పండ్లను కొన్ని ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకుంటే..

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!


పాలు, పెరుగుతో మామిడిపండ్లను తినడం చాలామంది అలవాటు. కొందరు మిల్క్ షేక్స్ రూపంలోనూ, మరికొందరు పెరుగన్నంలోనూ, లస్సీ తయారీలోనూ మామిడి పండ్లను ఉపయోగిస్తారు. అయితే ఇలా తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు తొందరగా వస్తాయి. మామిడిలో ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇక పాలలో ప్రోటీన్లు ఉంటాయి. ఇవి రెండూ కలిస్తే ఆహారం పులిసిపోతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువుకు కారణమవుతుంది.

మద్యపానం తీసుకునేవారు కూడా చాలామందే ఉంటారు. అయితే మామిడి పండు తినడానికి ముందు లేదా తర్వాత మద్యం సేవించడం ప్రమాదం. మామిడి పండ్లలో ఫైబర్, సహజ చక్కెరలు జీర్ణ సమస్యలు పెంచుతాయి ఇది ఆహారం జీర్ణం చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?


కారంగా ఉన్న ఆహారంతో పాటూ మామిడి పండును తినకూడదు. మామిడి పండ్లలో ఉండే తీపి, పులుపు రెండూ కారంగా ఉన్న ఆహారంతో కలిసి కడుపులో చికాకు, ఎసిడిటీ సమస్య వచ్చేలా చేస్తుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయి.

గుడ్లు, మాంసం, పప్పులు మొదలైన వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇలా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలతో మామిడిపండు తినకూడదు. జీర్ణక్రియ మందగించి ఉదర సంబంధ సమస్యలు వస్తాయి. అంతేకాదు జీర్ణక్రియ మందగించడం వల్ల ప్రోటీన్ శోషణకు ఆటంకం కలుగుతుంది.

చాలామంది పండ్ల కాంబినేషన్ లో మామిడి పండ్లను చేరుస్తూ ఉంటారు. అయితే అరటిపండు ద్రాక్ష లేదా చెర్రీస్ వంటి ఇతర తీపి పండ్లతో కలిపి మామిడిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. మధుమేహం ఉన్నవారికి, మధుమేహం వచ్చే అవకాశం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదం.

పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?

మామిడి పండుతో పొరపాటున కూడా కలిపి తినకూడని ఆహారాల లిస్ట్ ఇదీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 08 , 2024 | 11:02 AM