Share News

Child Care Tips: మొదటిసారి బిడ్డకు పాలు పడుతున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..!

ABN , Publish Date - Aug 04 , 2024 | 08:02 PM

Mother and Child Care Tips: ఏ మహిళకు అయినా మాతృత్వాన్ని మించిన సంతోషం మరొకటి ఉండదు. నవ మాసాలు మోసి కన్నబిడ్డకు తొలిసారి పాలు పట్టినప్పుడు ఆ తల్లిలో కలిగే అనుభూతి మాటలతో చెప్పలేం. పుట్టిన బిడ్డ సైతం తన తల్లి చనుబాలు తాగుతూ పలికించే హావభావాలు చూసి ఆ తల్లి మురిసిపోతుంటుంది.

Child Care Tips: మొదటిసారి బిడ్డకు పాలు పడుతున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి..!
Mother Feeding

Mother and Child Care Tips: ఏ మహిళకు అయినా మాతృత్వాన్ని మించిన సంతోషం మరొకటి ఉండదు. నవ మాసాలు మోసి కన్నబిడ్డకు తొలిసారి పాలు పట్టినప్పుడు ఆ తల్లిలో కలిగే అనుభూతి మాటలతో చెప్పలేం. పుట్టిన బిడ్డ సైతం తన తల్లి చనుబాలు తాగుతూ పలికించే హావభావాలు చూసి ఆ తల్లి మురిసిపోతుంటుంది. ఇక తొలిసారి బిడ్డకు పట్టించే పాలను ముర్రుపాలు అంటారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో ఇచ్చే పాలు ఆ బిడ్డకు అమృతం లాంటివి అంటారు. అందుకే బిడ్డ పుట్టిన తరువాత తప్పనిసరిగా ఆ బిడ్డకు తల్లిపాలు పట్టాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదంతా ఇలా ఉంచితే.. మీరు మొదటిసారిగా తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవవాలి. తద్వారా మీ బిడ్డను ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ కీలక విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..


నీరు తాగాలి: తల్లి తన బిడ్డకు పాలు ఇచ్చే సమయంలో మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ఇందుకోసం తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. తద్వారా పాల పరిమాణం అలాగే ఉంటుంది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు.

గోరువెచ్చని నీటితో కడగాలి: బిడ్డకు పాలు ఇచ్చే ముందు రొమ్మును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బును ఉపయోగించవద్దు. సబ్బును ఉపయోగిస్తే చర్మం పొడిగా మారడంతో పాటు.. చనుమొన దెబ్బతింటుంది.


చనుమొనను శుభ్రపరచడం: శుభ్రమైన క్లాత్ లేదా మృదువైన టవల్‌తో చనుమొన, పరిసర ప్రాంతాలను తుడవాలి. ఇలా చేయడం వలన మురికి అవశేషాలను తొలగిపోతాయి.

సౌకర్యవంతమైన దుస్తులు ధరించండి: శుభ్రమైన, సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి. అలాగే మీరు ధరించే దుస్తులను ప్రతి రోజూ వాష్ చేయాలి. టైట్‌ దుస్తులు కాకుండా.. వొదులుగా, గాలి వచ్చేవిధంగా ఉండే దుస్తులు ధరించాలి.


ఓపిక అవసరం: తొలిసారి మీరు బిడ్డకు పాలు ఇస్తున్నట్లయితే.. మీలో ఓపిక చాలా అవసరం. శిశువు తొలుత పాలు సరిగా తాగలేరు. పాలు తాగడం నేర్చుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. పిల్లలు పాలే తాగే వరకు ప్రేమగా, ఓపికగా చూసుకోవాలి.

సరైన స్థితి: శిశువుకు పాలు పట్టించేటప్పుడు సరైన విధంగా పట్టుకోవాలి. పిల్లలు ప్రశాంతంగా, హాయిగా పాలు తాగడానికి వారి తల, శరీరం సరళ రేఖలో ఉండేలా చూసుకోవాలి. శిశువు నోరు చనుమొన ముందు ఉంచాలి. తద్వారా పిల్లలు పాలు సరిగ్గా తాగగలరు.


Also Read:

బంగ్లాదేశ్‌లో ఒకే రోజు 57 మంది మృతి.. రాజీనామా దిశగా హసీనా ?

BSNL 4జీ సేవలపై కీలక ప్రకటన

ఉప్పల్ ఫ్లైఓవర్‌పై ప్రభుత్వం ఫోకస్..!!

For More Health News and Telugu News..

Updated Date - Aug 04 , 2024 | 08:02 PM