Health News: బీ కేర్ ఫుల్.. నిద్రకు ముందు ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ??
ABN , Publish Date - Feb 27 , 2024 | 05:31 PM
శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది.
శరీరానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర అంత కంటే ఎక్కువ అవసరం. అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందేందుకు ఆహారంలోని పోషక పదార్థాలు ఉపయోగపడితే మానసిక ఆరోగ్యం కోసం నిద్ర ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర అత్యంత అవసరం. శరీరం పూర్తిగా కోలుకోవడానికి, మరుసటి రోజు పని చేసేందుకు సిద్ధంగా ఉండటానికి నిద్ర తప్పనిసరి. కానీ మారిపోతున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కంటి నిండా నిద్రపోవడం లేదు. ఫలితంగా ఎన్నో రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే నిద్రపోయే సమయానికి ముందు మనం తినే కొన్ని ఆహార పదార్థాలు ప్రశాంతమైన నిద్రను దూరం చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కెఫీన్ తీసుకోవడం వల్ల స్లీప్ సర్కిల్ కు భంగం కలుగుతుంది. కాబట్టి కెఫిన్ పానీయాలకు బదులుగా హెర్బల్ టీలు తాగడం ఉత్తమం. కారంగా ఉండే ఆహారాలు గుండెల్లో మంట, అజీర్తిని కలిగిస్తాయి. అసౌకర్యంతో నిద్రకు భంగం కలుగుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం మొదట్లో రిలాక్స్‌గా అనిపించినప్పటికీ అది నిద్రపై తీవ్ర ప్రభావాలు చూపుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. కొవ్వు అధికంగా ఉన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి ప్రోటీన్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటి తేలికపాటి ఆహారాలు తీసుకోవడం మంచిది.
చక్కెర పదార్ధాల ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అంతగా తీపి తినాలనుకుంటే తాజా పండ్లను తినడం మంచి పద్ధతి. ప్రాసెస్ చేసిన ఫుడ్ నిద్రకు భంగం కలిగిస్తాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కలిగి నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. రెడ్ మీట్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కార్బోనేటేడ్ పానీయాలు ఉబ్బరం, అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి నిద్రపోయే ముందు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే ఉత్తమం.
మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.