Share News

Oats Vs Daliya: ఓట్స్ లేదా గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 06:53 PM

బరువు తగ్గాలని అనుకునే వారు చాలామంది ఓట్స్ ను ఆహారంలో తీసుకుంటారు. మరికొందరు గోధుమ నూకను ఎంచుకుంటారు. ఈ రెండింటిలో ఏది బెస్టంటే..

Oats Vs Daliya: ఓట్స్ లేదా గోధుమ నూక.. బరువు తగ్గడానికి ఏది మంచిదంటే..
Weight Loss

బరువు తగ్గాలని అనుకునే వారు మొదటగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆహార నిపుణులు, వెల్నెస్ కోచ్ లు చెబుతుంటారు. ఈ కారణంగా చాలామంది బరువు తగ్గడం కోసం అన్నం, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉన్న పదార్థాలకు బదులుగా ఓట్స్, గోధుమ నూక వంటివి ఎంచుకుంటారు. ఓట్స్ ను కేవలం ఉదయం సమయంలో అల్పాహారంగానే కాకుండా దోశ, ఇడ్లీ, ఉప్మా, మసాలా ఓట్స్, ఓట్స్ పొంగల్ వంటి టిఫిన్స్ లానూ వండుకుంటారు. ఇక గోధుమ నూకను ఉప్మా, కిచిడి వంటి టిఫిన్లుగా వండుకుంటారు. అయితే ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది ఉత్తమం తెలుసుకుంటే..

Health Tips: ఒక్క స్పూన్ వాము గింజలతో యూరిక్ యాసిడ్ కు చెక్ పెట్టొచ్చట.. ఇంతకీ ఎలా వాడాలంటే..


ఓట్స్..

ఓట్స్ ను బార్లీ నుండి తయారు చేస్తారు. ఓట్స్ పోషకాలకు పవర్ హౌస్ గా చెబుతారు. ఓట్స్ తింటే శరీరానికి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి. ఇవి రోజంతా శరీరానికి శక్తిని ఇస్తాయి. ఓట్స్ లో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్తంలో చక్కెరను కూడా నియంత్రణలో ఉంచుతుంది.

గోధుమ నూక..

గోధుమ నూకను దలియా అని కూడా అంటారు. ఇది సాధారణ రవ్వకంటే పెద్దగా ఉంటుంది. గోధుమ నూక కూడా పోషకాల పరంగా ఆరోగ్యకరమైనది. గోధుమనూకలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు గోధుమ నూకలో కూడా ఉంటాయి. ఇవి రోజంతా శక్తిని ఇస్తాయి. ఇవి మాత్రమే కాకుండా విటమిన్-బి, ఐరన్, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు గోధుమనూకలో ఉంటాయి. గోధుమ నూకను ఆహారంలో తీసుకుంటే శరీరంలో ఎర్ర రక్తకణాల పెరుగుదలలో, నరాల పనితీరులో చక్కగా సహాయపడుతుంది.

Banana: అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయ్..


ఏది బెస్ట్..

ఓట్స్, గోధుమ నూక రెండూ బరువు తగ్గడానికి మంచివే.. అయితే వాటిని తీసుకునే విధానం ముఖ్యం. ఓట్స్ ను కూరగాయలతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ఓట్స్ లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పైబర్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి.

గోధుమ నూకలో ఓట్స్ తో పోలిస్తే కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునే వారు గోధుమ నూకను కూరగాయలతో కలిపి తీసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..

జుట్టు చిట్లుతోందా.. అసలు కారణాలు ఇవే..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 22 , 2024 | 06:53 PM