Blast: రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు.. 20 మంది మృతి, మరో 30 మందికి గాయాలు
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:56 AM
ఓ రైల్వే స్టేషన్‌లో ఆకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

పాకిస్థాన్(Pakistan)లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో ఈరోజు భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా, మరో 30 మంది గాయపడ్డారు. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాకముందే రైల్వే స్టేషన్ బుకింగ్ కార్యాలయంలో పేలుడు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 9 గంటలకు పెషావర్‌కు బయలుదేరాల్సి ఉందని ఓ నివేదిక తెలిపింది.
ఆ సమయంలో పేలుడు సంభవించగా, రైలు ఇంకా ప్లాట్‌ఫారమ్‌పైకి రాలేదని అధికారులు తెలిపారు. స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుందని, ఆ క్రమంలోనే పేలుడు జరుగగా ప్రాణనష్టం జరిగిందన్నారు. అంతేకాదు స్టేషన్‌లోకి ట్రైన్ వచ్చి ఉంటే ప్రాణనష్టం తీవ్రత మరింత పెరిగేదని అధికారులు అంటున్నారు.
రెండు పేలుళ్లు
పేలుడు అనంతరం క్వెట్టా రైల్వే స్టేషన్‌లో జనం అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారు. స్టేషన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌లను కూడా రప్పించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. క్వెట్టాలో ఒకదాని తర్వాత ఒకటి రెండు బాంబు పేలుళ్లు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి పేలుడులో నలుగురు మరణించగా, రెండవ పేలుడులో దాదాపు 15 నుంచి 26 మంది మరణించారని చెబుతున్నారు. పేలుళ్లలో ఇంతకంటే ఎక్కువ మంది గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పేలుడు ఘటనకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు.
సీఎంల స్పందన
అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేస్తున్న ఈ దాడులు మానవత్వానికి శత్రువులని తాత్కాలిక అధ్యక్షుడు సయ్యద్ యూసఫ్ రజా గిలానీ అన్నారు. ఈ ఘోరమైన ఘటనను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సాధ్యమైన ప్రతి చర్య తీసుకోవాలని సంకల్పించినట్లు పునరుద్ఘాటించారు.
మరోవైపు బెలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ ఈ ఘోర ఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ప్రావిన్స్ నుంచి ఉగ్రవాద ముప్పును నిర్మూలించాలనే తన సంకల్పాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. సీఎంల ప్రకటనల నేపథ్యంలో ఉగ్రవాదులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More International News and Latest Telugu News