Donald Trump: ట్రంప్‌పై కాల్పుల కేసులో మరో దిమ్మతిరిగే ట్విస్టు.. కొన్ని నిమిషాల ముందే..
ABN , Publish Date - Jul 16 , 2024 | 03:55 PM
యావత్ ప్రపంచాన్నే హడలెత్తించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల కేసులో.. దిమ్మతిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రక్షణ విషయంలో అమెరికా ఏజెన్సీలు గందరగోళంగా..
యావత్ ప్రపంచాన్నే హడలెత్తించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై (Donald Trump) కాల్పుల కేసులో.. దిమ్మతిరిగే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రక్షణ విషయంలో అమెరికా ఏజెన్సీలు గందరగోళంగా వ్యవహరించడం వల్లే.. ఈ ఘటన చోటు చేసుకున్నట్టు ఇదివరకే విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. ట్రంప్‌పై కాల్పులు జరగపడానికి కొన్ని నిమిషాల ముందు.. ముగ్గురు స్నైపర్స్ నిందితుడు థామస్ మాథ్యూ క్రూక్స్‌ని (Thomas Mathew Crooks) చూసినట్లు వెల్లడైంది.
రిపోర్ట్స్ ప్రకారం.. థామస్ ఏ ఇంటి పైకప్పు నుంచి ట్రంప్‌పై దాడి చేశాడో, అదే ఇంట్లో ముగ్గురు స్నైపర్స్ ఉన్నారు. ఈ స్నైపర్‌ల బృందం ‘బట్లర్ కౌంటీ ఎమర్జెన్సీ సర్వీసెస్ యూనిట్’కు చెందినవాళ్లని తెలిసింది. ఆ బృందం.. రెండో ఫ్లోర్‌లోని కిటికీ నుంచి తుపాకులు ఎక్కుపెట్టి అభిమానులను గమనిస్తోంది. అయితే.. ఆ ముగ్గురు స్నైపర్లలో ఒకరు అంతకుముందే క్రూక్స్‌ని బయట చూశాడట. ఇంటి పైకప్పు వైపు ఆ స్నైపర్ చూసినప్పుడు క్రూక్స్ కనిపించాడని, ఆ వెంటనే అతడు అదృశ్యమయ్యాడని.. లాఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి వెల్లడించాడు. ఆ తర్వాత క్రూక్స్ బ్యాక్‌ప్యాక్‌తో తిరిగొచ్చి, ఫోన్ చూసుకుంటూ కూర్చున్నట్టు ఆ స్నైపర్ గుర్తించాడని చెప్పాడు. అప్పుడు ముగ్గురు స్నైపర్స్‌లో ఒకరు అతని ఫోటో తీశారని కూడా పేర్కొన్నాడు.
అనంతరం క్రూక్స్ ఒక రేంజ్‌ఫైండర్‌ను బయటకు తీసిన దృశ్యాన్ని సైతం సీక్రెట్ సర్వీస్ స్నైపర్ గమనించి.. రేడియో సెట్‌లో కమాండ్ సెంటర్‌కు తెలియజేసినట్లు విచారణలో తేలింది. ఇంతలోనే క్రూక్స్ మాయమై, మళ్లీ అతడు మూడోసారి బ్యాక్‌ప్యాక్‌తో తిరిగొచ్చాడు. దీంతో.. స్నైపర్లు వెంటనే ఈ సమాచారాన్ని కాల్ చేసి తెలియజేశారు. అతని వద్ద బ్యాక్‌ప్యాక్ ఉందని, భవనం వెనుక వైపు ఆ అబ్బాయి నడుస్తున్నాడని చెప్పారు. బ్యాకప్‌గా ఇతర అధికారులు వచ్చేలోపు అతడు భవనంపైకి ఎక్కాడు. అప్పటికే లోపలున్న ఇతర స్నైపర్స్ కంటపడకుండా.. అతడు పాకుతూ బిల్డింగ్ ఎక్కేశాడు. ఇక ఆ తర్వాత అతడు కాల్పులు జరపడం, క్షణాల వ్యవధిలోనే ఇతర స్పైపర్స్ అతడిని కాల్చి చంపడం.. చకచకా జరిగిపోయింది.
Read Latest International News and Telugu News