Al-Qaida: రూ.40 కోట్ల రివార్డు ఉన్న అల్ ఖైదా నేత అనుమానాస్పద మృతి
ABN , Publish Date - Mar 11 , 2024 | 12:21 PM
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ బటర్ఫీ చనిపోయాడు.ఈ విషయాన్ని ఆ సంస్థ ధృవీకరించింది. అతని మరణానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపిస్తూ వీడియో విడుదల చేసింది. అల్ బటర్పీపై తలపై అమెరికా గతంలో రూ.40 కోట్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏబీఎన్ ఇంటర్నెట్: అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు షాక్ తగిలింది. యెమెన్ శాఖ నేత ఖలీద్ అల్ బటర్ఫీ (Khalid Al-Batarfi) చనిపోయాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ ధృవీకరించింది. అతని మరణానికి గల కారణం తెలియరాలేదు. అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్న మృతదేహాన్ని చూపిస్తూ వీడియో విడుదల చేసింది. అల్ బటర్పీపై (Khalid Al-Batarfi) తలపై అమెరికా గతంలో రూ.40 కోట్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒసామా బిన్ లాడెన్ తర్వాత అత్యంత ప్రమాదకర వ్యక్తిగా అల్ బటర్పీ (Khalid Al-Batarfi) అవతరించాడు. తన యెమెన్ గ్రూపును సమర్థంగా తీర్చిదిద్దాడు. ఖలీద్ అల్ బటర్పీ చనిపోవడంతో అతని స్థనంలో సాద్ బిన్ అతేఫ్ అల్ అవ్లాకీ నాయకత్వం వహిస్తారు.
2009లో అమెరికాలో విమానం పేల్చివేసేందుకు అల్ ఖైదా యెమెన్ ప్రయత్నించింది. 2015లో ఫ్రాన్స్‌లో జరిగిన దాడులు చేసింది తామేనని ప్రకటించుకుంది. దాంతో అల్ ఖైదా యెమెన్ విభాగం లక్ష్యంగా అమెరికా భావించింది. 2020లో అమెరికా చేసిన డ్రోన దాడిలో ఖాసీ అల్ రిమీ చనిపోయాడు. ఆ తర్వాత ఖలీద్ అల్ బటర్ఫీ బాధ్యతలు స్వీకరించారు. అల్ బటర్ఫీ సౌదీ అరేబియాలో జన్మించాడు. 1999లో అప్ఘనిస్థాన్‌కు తన మకాం మార్చాడు. తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యం లక్ష్యంగా దాడులకు తెగ బడ్డాడు. 2010లో అల్ ఖైదాలో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. అల్ బటర్పీ మరణానికి గల కారణం తెలియలేదు. అతని మొహంపై గాయాలు అయినట్టు కనిపించడం లేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.