Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం హ్యాక్.. వారి పనేనా..

ABN , Publish Date - Aug 11 , 2024 | 08:04 AM

అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష ఎన్నికల ప్రచారం శనివారం హ్యాక్ చేయబడిందని ప్రచార సంస్థ పొలిటికో(politico) ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. ప్రచారం నుంచి అంతర్గత పత్రాలతోపాటు అనామక ఖాతా నుంచి ఇమెయిల్స్ వచ్చాయని వెల్లడించారు.

 Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం హ్యాక్.. వారి పనేనా..
Donald Trump

అమెరికా(america) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అధ్యక్ష ఎన్నికల ప్రచారం శనివారం హ్యాక్ చేయబడిందని ప్రచార సంస్థ పొలిటికో(politico) ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తెలిపారు. ప్రచారం నుంచి అంతర్గత పత్రాలతోపాటు అనామక ఖాతా నుంచి ఇమెయిల్స్ వచ్చాయని వెల్లడించారు. దీనికి ఇరాన్ ప్రమేయముందుని చెబుతున్నప్పటికీ నిర్దిష్ట సాక్ష్యాలను అందించలేదు. ట్రంప్ వైట్ హౌస్‌లో తన మొదటి నాలుగు సంవత్సరాలలో చేసినట్లే తమ టెర్రర్ పాలనను ఆపుతారని ఇరానియన్లకు తెలుసని అందుకే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు.


ఫిషింగ్ ఇమెయిల్

అయితే ఇటివల మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం జూన్ 2024లో US అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇరాన్ హ్యాకర్లు 'ఉన్నత స్థాయి అధికారి' ఖాతాలోకి చొరబడ్డారని తెలిపింది. ఇది అధ్యక్షుడు ట్రంప్ వైస్‌ను ఎన్నుకునే దగ్గరి సమయానికి సమానంగా ఉంటుందని తెలిపింది మైక్రోసాఫ్ట్(microsoft) నివేదికను విడుదల చేసిన తర్వాత ఇది వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే జూన్‌లో ఇరాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ మాజీ సీనియర్ సలహాదారు ఇమెయిల్ ఖాతా నుంచి అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి చెందిన ఉన్నత స్థాయి అధికారికి వచ్చిన ఫిషింగ్ ఇమెయిల్ గురించి కూడా ప్రస్తావించారు.


చాలా కాలంగా

అక్రమ విదేశీ జోక్యానికి సంబంధించిన ఏదైనా జరిగినట్లు తేలితే అత్యంత తీవ్రంగా పరిణమిస్తామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అన్నారు. US ప్రజాస్వామ్య సంస్థలపై విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఏ ప్రభుత్వమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. ఏదేమైనా ఇరాన్ వెలుపల తన శత్రువులను లక్ష్యంగా చేసుకుని హ్యాకింగ్ ప్రచారాలను నడుపుతున్నట్లు చాలాకాలంగా అనుమానించబడుతుంది. 2020లో ప్రముఖ రివల్యూషనరీ గార్డ్ జనరల్ ఖాస్సేమ్ సులేమానీని హతమార్చేందుకు ఆదేశించిన 2020 డ్రోన్ ఘటన నేపథ్యంలో ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని టెహ్రాన్ చాలా కాలంగా బెదిరించింది.


గత నెలలో

సులేమానిని US హతమార్చినందుకు ప్రతీకారంగా 46 ఏళ్ల ఆసిఫ్ మర్చంట్ USలోని వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. సులేమానీపై డ్రోన్ దాడులను ఆమోదించిన ట్రంప్ ఉద్దేశించిన లక్ష్యాలలో ఒకరని FBI పరిశోధకులు విశ్వసిస్తున్నారని US అధికారి ఒకరు తెలిపారు. గత నెలలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తరువాత ఇరాన్ నుంచి వచ్చిన ముప్పు గురించి కూడా నివేదికలు వెలువడ్డాయి. అయితే ఇది పెన్సిల్వేనియాలోని బట్లర్ కౌంటీలో జరిగిన ర్యాలీ దాడికి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ వారం ప్రారంభంలో US న్యాయ విభాగం ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న ఓ పాకిస్తానీ వ్యక్తిని అమెరికన్ గడ్డపై రాజకీయ హత్యలు చేయడానికి అభియోగాలు మోపినట్లు ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

Multibagger Stock: రూ.1,113 నుంచి రూ.10,310కి చేరిన షేర్ ప్రైస్.. ఐదేళ్లలోనే మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి..


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More International News and Latest Telugu News

Updated Date - Aug 11 , 2024 | 08:08 AM