Share News

Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత

ABN , Publish Date - Aug 11 , 2024 | 07:38 AM

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.

Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
Natwar Singh Passes Away

ఢిల్లీ: సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి కే నట్వర్ సింగ్ (Natwar Singh Passes Away) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లో గల మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నట్వర్ సింగ్ చనిపోయారని కుటుంబ సభ్యులు మీడియాకు వివరించారు. మన్మోహన్ సింగ్ హయాంలో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.


natwar-2.jpg


నేపథ్యం..

రాజస్థాన్ భరత్‌పూర్ జిల్లాలో 1931లో నట్వర్ సింగ్ జన్మించారు. ప్రాథమిక రాజస్థాన్‌లో జరిగింది. పై చదువలు కోసం ఢిల్లీకి వచ్చారు. సెయింట్ స్టీఫెన్ కాలేజీలో హిస్టరీ చదివారు. తర్వాత యూకేలో గల కేంబ్రిడ్జి వర్సిటీలో ఆపై చదువులు చదివారు. నట్వర్ సింగ్ ఐఎఫ్ఎస్‌కు ఎంపికై దౌత్యవేత్తగా పనిచేశారు. కెరీర్‌లో కీలక పదవులు నిర్వహించారు. దౌత్యవేత్త నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. కేంద్ర సహాయ మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కెరీర్ ప్రారంభించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసి, మంచి పేరు తెచ్చుకున్నారు.


natwar-3.jpg


కెరీర్‌లో కీలక బాధ్యతలు..

1953లో నట్వర్ సింగ్ విదేశీ వ్యవహారాల్లో కెరీర్ ప్రారంభించారు. కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదిగారు. 1973 నుంచి 1977 వరకు యూకేలో ఇండియా డిప్యూటీ హై కమిషనర్‌‌గా విధులు నిర్వహించారు. 1980 నుంచి 1982 వరకు పాకిస్థాన్‌‌లో భారత రాయబారిగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియా- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే పనిచేస్తారని పేరు తెచ్చుకున్నారు. ఆ క్రమంలో కీలక బాధ్యతలను ఆయనకు అప్పటి ప్రభుత్వం అప్పగించింది.


natwar-4.jpg


రాజకీయ ప్రవేశం

విదేశీ వ్యవహారాల నుంచి నట్వర్ సింగ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు. 1984లో భారత్ పూర్ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు. ఆ వెంటనే రాజీవ్ గాంధీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 1985-86 వరకు ఉక్కు, మైనింగ్ శాఖ సహాయ మంత్రి పదవి అప్పగించారు. 1986లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చింది. 2004-05లో మన్మోహన్ సింగ్ హయాంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డు నట్వర్ సింగ్‌‌ను వరించింది. నట్వర్ సింగ్ మృ‌తిపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ విచారం వ్యక్తం చేశారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 11 , 2024 | 08:55 AM