Share News

Open Fire: పార్కులో కాల్పులు.. 10 మందికి గాయాలు!

ABN , Publish Date - Jun 16 , 2024 | 08:17 AM

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. మిచిగాన్‌(Michigan)లోని చిల్డ్రన్స్ వాటర్ పార్క్‌లో శనివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఓ ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మంది గాయపడ్డారు.

Open Fire: పార్కులో కాల్పులు.. 10 మందికి గాయాలు!
shooting fire Michigan USA

అగ్రరాజ్యం అమెరికా(america)లో మళ్లీ కాల్పులు(firing) కలకలం రేపుతున్నాయి. మిచిగాన్‌(Michigan)లోని చిల్డ్రన్స్ వాటర్ పార్క్‌లో శనివారం సాయంత్రం ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఓ ఎనిమిదేళ్ల చిన్నారితో సహా 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దీంతోపాటు దాడి చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇటివల రెండు రోజుల క్రితం అమెరికాలోని ఓహియో నైట్‌క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మరువక ముందే మరో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో స్ప్లాష్ ప్యాడ్ వద్దకు వచ్చి ఓ వాహనం దిగిన వ్యక్తి తర్వాత కాల్పులు(firing) జరిపాడు. అనుమానితుడు తన తుపాకీని చాలాసార్లు రీలోడ్ చేసి 28 సార్లు కాల్పులు జరిపాడని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియనప్పటికీ, ఈ దాడి యాదృచ్ఛికంగా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


అయితే దాడి జరిగిన ప్రదేశానికి చేరుకుని పోలీసులు భద్రత కల్పించారని రోచెస్టర్ హిల్స్ మేయర్ బ్రియాన్ తెలిపారు. రోచెస్టర్ హిల్స్(Rochester Hills) ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రస్తుతం సురక్షితంగా ఉందన్నారు. ఈ కేసులో వెంటనే అప్రమత్తమై స్పందించిన అధికారులను అభినందించారు. మరోవైపు అమెరికాలో ఇప్పటివరకు 215 కంటే ఎక్కువ కాల్పులు జరగడం విశేషం. అమెరికా తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ తుపాకీ సంస్కృతికిని మాత్రం అరికట్టలేకపోతుంది.


ఇది కూడా చదవండి:

Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు..ఈ రోజు ఏం చేస్తారు


వర్షార్పణం కెనడాతో భారత్‌ మ్యాచ్‌ రద్దు


ఈఎంఐలు మరింత ప్రియం

Read Latest International News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 08:27 AM