Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత ప్రాంతంపై దాడి..13 మంది మృతి
ABN , Publish Date - Jan 21 , 2024 | 04:12 PM
ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ నగర శివార్లలోని మార్కెట్‌పై ఆదివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటలో 13 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు.
ఉక్రెయిన్‌లో మళ్లీ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రష్యా ఆక్రమిత ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ నగర శివార్లలోని మార్కెట్‌పై ఆదివారం క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటలో 13 మంది మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడ్డారని డొనెట్స్‌క్‌లో రష్యా ఇన్‌స్టాల్డ్ అథారిటీస్ హెడ్ డెనిస్ పుషిలిన్ చెప్పారు.
అయితే ఉక్రెయిన్ మిలటరీ ఈ దాడి చేసిందని ఆయన అన్నారు. ఘటనా స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయని పుషిలిన్ తెలిపారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు రష్యాలోని ఉస్ట్ లూగా పోర్ట్‌లోని రసాయన రవాణా టెర్మినల్‌లో కూడా మంటలు చెలరేగినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. ఓడరేవుపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడి చేశాయని దీంతో గ్యాస్ ట్యాంక్ పేలిపోయిందని అక్కడి మీడియా తెలిపింది. దీంతోపాటు సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు నైరుతి దిశలో 165 కిలోమీటర్ల దూరంలో రష్యాలోని రెండవ అతిపెద్ద సహజవాయువు ఉత్పత్తిదారు నోవాటెక్ నిర్వహిస్తున్న ప్రదేశంలో మంటలు చెలరేగాయని అన్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.