Share News

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పక్క దేశాల భయాందోళన.. కారణమిదేనా..

ABN , Publish Date - Nov 10 , 2024 | 07:28 AM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సమీకరణాలు మారుతున్నాయి. ప్రధానంగా వలసల విషయంలో అమెరికా పక్కదేశమైన కెనడా కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పక్క దేశాల భయాందోళన.. కారణమిదేనా..
canada high alert

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం తర్వాత ప్రపంచంలోని పలు దేశాలు భయపడుతున్నాయి. వీటిలో ప్రధానంగా యునైటెడ్ స్టేట్స్ పొరుగు దేశమైన కెనడా(Canada) అప్రమత్తంగా ఉంది. ఈ క్రమంలో యూఎస్ సరిహద్దుల్లో కఠినమైన నిఘా ఉంచారు. ఎందుకంటే అమెరికా ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారులు "దేశ రక్తాన్ని విషపూరితం" చేశారని ఆయన ఆరోపించారు. ఈ కారణంగా కెనడా అమెరికా నుంచి వచ్చే వలసదారులను ఎదుర్కొవటానికి చర్యలు తీసుకుంటుంది.


సరిహద్దుల్లో నిఘా

ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఏం జరగబోతోందోని తాము సరిహద్దుల వైపు చూస్తున్నామని కెనడా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రతినిధి సార్జెంట్ చార్లెస్ అన్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బహిష్కరణ కార్యక్రమం ద్వారా కెనడాలోకి వచ్చే అక్రమ వలసదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికాలో అక్రమ వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరి ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది. అమెరికా అనేక సమస్యలకు అక్రమ వలసదారులే అతిపెద్ద కారణమని ట్రంప్ భావించారు. ఈ కారణంగా ఆయన అమెరికా నుంచి అక్రమ వలసదారులందరినీ బహిష్కరించనున్నారు.


అక్రమ వలసదారులకు షాక్

గతంలో డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష పదవీ కాలంలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మార్చారు. మెక్సికో, అమెరికా మధ్య సరిహద్దులో పెద్ద గోడ కూడా నిర్మించారు. తద్వారా అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చని భావించారు. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పెన్సిల్వేనియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ చరిత్రలో అతిపెద్ద వలసదారుల వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తద్వారా అమెరికాలోకి అక్రమ ప్రవేశాన్ని అరికట్టవచ్చు. లక్షలాది మంది అక్రమ వలసదారులను కూడా వెనక్కి పంపించే అవకాశం ఉంది.


ఇప్పటివరకు

ఇక 2017 నుంచి 2021 వరకు ట్రంప్ మొదట అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా నుంచి తొలగించబడిన హైతియన్‌లతో సహా పదివేల మంది వలసదారులు కెనడాకు పారిపోయారు. ఇమ్మిగ్రేషన్, రీలొకేషన్ వంటి నిబంధనల కారణంగా కెనడాకు వెళ్లే వారి సంఖ్య 10 రెట్లు పెరిగింది. సరిహద్దు చెక్‌పోస్టుల మధ్య కెనడాలోకి ప్రవేశించడం చట్టవిరుద్ధం, ప్రమాదకరమైనదని పేర్కొన్నప్పటికీ ఈ సంఖ్య పెరిగింది.

రికార్డు స్థాయిలో

అయితే ఈసారి ఒక్కసారిగా వేలాది మంది వస్తే అదుపు చేయలేమని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో కెమెరాలు, సెన్సార్లు, డ్రోన్‌లతో సహా అదనపు వనరులను మోహరించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. కెనడాలో ఇప్పటికే రికార్డు స్థాయిలో శరణార్థులు ఉన్నారు. జూలైలో దాదాపు 20,000 మంది రాగా, ఇప్పటికే 250,000 కంటే ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. టొరంటో FCJ రెఫ్యూజీ సెంటర్ వారానికి డజన్ల కొద్దీ కొత్త శరణార్థులకు సేవలు అందిస్తోంది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..

PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More International News and Latest Telugu News

Updated Date - Nov 10 , 2024 | 07:38 AM