UAE: ఎడారి నేలలో జలప్రళయం.. భీకర వర్షాలతో వణుకుతున్న దుబాయి
ABN , Publish Date - Apr 17 , 2024 | 12:59 PM
ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
దుబాయి: ఎడారి నేలను తుపాన్ వణికిస్తున్నాయి. ఏప్రిల్ 15 సాయంత్రం నుంచి తుపాన్(Dubai Cyclone) ధాటికి కురుస్తున్న భీకర వర్షాలతో దుబాయి చిగురుటాకులా వణుకుతోంది. ఆకస్మిక వరదల వల్ల దాదాపు 18 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. శుష్క వాతావరణం, భారీ ఉష్ణోగ్రతలను చూసే దుబాయి ప్రజలు.. జలప్రళయాన్ని చూస్తూ భయాందోళన చెందుతున్నారు. భారీ వర్షాల ప్రభావంతో పదుల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి.
వరదల ధాటికి నగరం స్తంభించిపోయింది. ఎటు చూసిన వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది భారీ వర్షాల కారణంగా విమానాలను దారి మళ్లించారు. దీంతో 100కుపైగా విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి.
Ayodhya: అయోధ్య రాముడి నుదట సూర్య తిలకం.. వీక్షించేందుకు తరలివస్తున్న భక్తులు
కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్ని రద్దు అయ్యాయి. అక్కడి పరిస్థితిని వివరించేలా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విమానాశ్రయం పార్కింగ్ స్థలంలో సగం మేర మునిగిపోయిన కార్లు కనిపించాయి. ఎయిర్ పోర్ట్‌కి వెళ్లే యాక్సెస్ రోడ్లు జలమయమయ్యాయి.
దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లతో సహా నగరంలోని కీలకమైన ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో పాదాల లోతు నీరు నిలిచింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. నివాస సముదాయాలు మునిగిపోయాయి. తుపాన్ ప్రభావం దుబాయి దాటి విస్తరించింది. ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. గత సంవత్సరం COP28 UN వాతావరణ సమావేశానికి హాజరైనవారు యూఏఈని ప్రకృతి వైపరీత్యాలు వెంటాడతాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే వరదలు చుట్టుముట్టడం అధికారులను ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి