Share News

Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం.. ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:58 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.

Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం.. ఎలాన్ మస్క్ షాకింగ్ కామెంట్స్
Elon Musks comments on Kamala

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(donald trump)పై హత్యాయత్నం ఘటనపై స్పందించిన ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌లపై హత్యాయత్నం ఎందుకు జరగడం లేదని ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అయితే ఆదివారం ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల కాల్పులు జరగడంతో రెండో హత్యాయత్నంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినట్లు ఎఫ్‌బీఐ పేర్కొంది. దీంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్, పలు ఏజెన్సీలు ఆయన సురక్షితంగా ఉన్నారని తెలిపాయి.


షాకింగ్ కామెంట్స్

డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన ఘోరమైన దాడి తర్వాత ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఆశ్చర్యకరమైన రియాక్షన్ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌పై పదే పదే దాడి జరుగుతుండగా, కమలా హారిస్, జో బిడెన్‌పై దాడి చేయడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని మస్క్ అన్నారు. మస్క్ ఈ వ్యాఖ్యపై వివాదం రేగుతోంది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుగా ఉన్నారని అనేక కామెంట్లు వస్తున్నాయి. ట్రంప్ విషయంలో మస్క్ తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని అంటున్నారు. మస్క్ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి. దీనిపై పలువురు ట్రంప్ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తుండగా, మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు.

elon musk.JPG


పొదల్లో

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, ట్రంప్ బయలుదేరే ప్రాంతానికి చాలా దగ్గరగా పొదల్లో అధికారులు AK 47 రైఫిల్‌ను కూడా కనుగొన్నారని చెప్పారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్స్‌లో కాల్పులు జరిగాయి. అక్కడి లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం పొదల్లో AK-47 కనుగొనబడిందని పేర్కొన్నారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో కాల్పులు జరిపిన రెండు నెలల తర్వాత ట్రంప్‌పై ఇటివల మళ్లీ హత్యాయత్నం జరిగింది. అప్పుడు ట్రంప్ కుడి చెవికి స్వల్ప గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే కాల్చిచంపారు.


రియాక్షన్స్

అయితే ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అనుమానిత దాడి చేసిన వ్యక్తిని ర్యాన్ రూత్‌గా గుర్తించారు. షూటింగ్ తర్వాత ర్యాన్ రూత్ పొదల్లో దాక్కున్నాడు. అయితే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరపడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డెమొక్రాటిక్ ప్రత్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ కూడా స్పందించారు. ఇద్దరికీ ఈ అంశం గురించి వివరించినట్లు వైట్ హౌస్ తెలిపింది. ఆ క్రమంలో మన దేశంలో ఎలాంటి రాజకీయ హింస లేదా హింసకు ఆస్కారం లేదని పేర్కొన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి:

Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌పై మళ్లీ కాల్పులు?.. ఆయన స్పందన ఇదే

Money Saving Plan: రిటైర్‌ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..

Next Week IPOs: ఈ వారం మార్కెట్లోకి రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్నంటే..

Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..

Read MoreInternational News and Latest Telugu News

Updated Date - Sep 16 , 2024 | 01:06 PM