Share News

Donald Trump: ట్రంప్‌ కాల్పుల ఘటనపై ఆయన కుమారుల స్పందన.. ఏమన్నారంటే

ABN , Publish Date - Jul 14 , 2024 | 07:53 AM

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగాయి. కాల్పుల అనంతరం ట్రంప్ ముఖం రక్తసిక్తమై కనిపించింది. ట్రంప్ వేదికపై మాట్లాడుతుండగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఈ ఘటనపై ఆయన కుమారులు స్పందించారు.

Donald Trump: ట్రంప్‌ కాల్పుల ఘటనపై ఆయన కుమారుల స్పందన.. ఏమన్నారంటే
His son Donald Trump Jr

అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగాయి. కాల్పుల అనంతరం ట్రంప్ ముఖం రక్తసిక్తమై కనిపించింది. ట్రంప్ వేదికపై మాట్లాడుతుండగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. పేలుళ్ల శబ్ధానికి ట్రంప్ వేదిక నుంచి పడిపోయారు. ఆ క్రమంలో మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ట్రంప్‌ను హ్యాండిల్ చేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ట్రంప్ ముఖం, చెవుల్లో రక్తం కనిపించింది. వేదికపై నుంచి వెళ్లే సమయంలో ట్రంప్ పిడికిలి బిగించి కనిపించారు. అయితే ఈ ఘటనలో కాల్పులు జరిపిన వ్యక్తితో సహా ఇద్దరు మరణించారు.


కుమారుల స్పందన

మరోవైపు ఈ ఘటనపై ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ స్పందించారు. తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అంతేకాదు అమెరికాను రక్షించడానికి ఆయన ఎప్పటికీ పోరాటాన్ని ఆపరని, రాడికల్ వామపక్షాలు అతనిపై దాడులు చేసినా ధీటుగా ఎదుర్కొంటారని ట్రంప్ జూనియర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో అతని సోదరుడు ఎరిక్ ట్రంప్ షూటింగ్ తర్వాత గాయపడిన ఆయన తండ్రి పిడికిలి చూపుతున్న చిత్రాన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అమెరికాకు కావాల్సిన ఫైటర్ ఈయనేనని అన్నారు. కాల్పులు జరిగిన తర్వాత కూడా ఆయన ఏ మాత్రం తగ్గడం లేదని భావించారు.


హత్యాయత్నం

పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రమాదం జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ క్షేమంగా ఉన్నారని, ఆయన భద్రతకు చర్యలు తీసుకున్నామని అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది. ఈ కాల్పులు ట్రంప్‌ను హత్య చేసే ప్రయత్నంలో భాగంగా జరిగాయని పేర్కొన్నారు. 1981లో రోనాల్డ్ రీగన్‌పై కాల్పులు జరిపిన తర్వాత అమెరికాలో అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై జరిగిన మొదటి హత్యాయత్నం ఇదేనని అక్కడి అధికారులు తెలిపారు.


ఇది కూడా చదవండి:

Donald Trump: ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు..

Elon Musk: అమెరికా ఎన్నికల వేళ.. ఎలాన్ మస్క్ భారీ విరాళం, కారణమిదేనా?

Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!

Read Latest International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 07:56 AM